సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్(CUET UG 2022) రాసే అభ్యర్ధులకు అలర్ట్. సీయూఈటీ 2022 పరీక్ష తేదీలు ప్రకటించబడ్డాయి. CUET UG 2022 పరీక్షలు జూలై 15 నుంచి ఆగస్టు 10 వరకు జరుగుతుంది. పూర్తి CUET UG 2022 పరీక్ష షెడ్యూల్ వెబ్సైట్- cuet.samarth.ac.inలో అందుబాటులో ఉంది. పరీక్ష CBT విధానంలో నిర్వహించబడుతుంది. నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (NTA) ఈ పరీక్షల్ని నిర్వహించనుంది. జూలై 15, 16,19, 20 మరియు ఆగష్టు 4, 5, 6,7, 8, 10 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయ్. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం మొదటిసారి CUETని ప్రవేశపెట్టారు. ఇండియాలో 45 సెంట్రల్ యూనివర్సిటీలు అందించే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందేందుకు విద్యార్థులు ఈ పరీక్షను తప్పనిసరిగా రాయాలి.
హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా, ఇంగ్లీష్ వంటి 13 భాషలలో పరీక్షను నిర్వహించనున్నారు. CUET UG కోసం UGC ప్రత్యేకంగా సిలబస్‌ను జారీ చేయలేదు. ఈ పరీక్ష NCERT సిలబస్ ఆధారంగా మాత్రమే ఉంటుంది.
దేశవ్యాప్తంగా 554 నగరాల్లో, విదేశాల్లోని 13 నగరాల్లో ఈ పరీక్ష జరగనున్నాయని యూజీసీ ఛైర్మన్ ఎం జగదీశ్ కుమార్ ట్వీట్ చేశారు. మొత్తం 9 లక్షల 50 వేల 804 మంది 86 యూనివర్శీటీల్లో సీటు కోసం అప్లై చేసుకున్నారు. ఇందులో 43 సెంట్రల్ యూనివర్శీటీలు, 13 స్టేట్ విశ్వవిద్యాలయాలు, 12 డీమ్డ్ యూనివర్శీటీలు ఉన్నాయ్.
National Testing Agency will be conducting Common University Entrance Test CUET (UG) - 2022 at different centres located in 554 cities across India and 13 Cities Outside-India: UGC Chairman M Jagadesh Kumar pic.twitter.com/pbcAzRz1nT
సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాలకు 2010 నుంచి సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CUCET)ను నిర్వహిస్తున్నారు. అయితే గత సంవత్సరం వరకు ఈ పరీక్ష ద్వారా కేవలం 14 సెంట్రల్ వర్సిటీలు మాత్రమే దీన్ని ఆమోదించాయి. దీంతో నూతన జాతీయ విద్యా విధానం (NEP) ప్రకటన తర్వాత.. మొత్తం 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం CUETని ప్రతిపాదించారు. ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల, బోర్డు నుంచి 12వ తరగతి పరీక్షలను క్లియర్ చేసిన విద్యార్థులందరూ CUET పరీక్షకు హాజరు కావడానికి అర్హులు.
* మంచి స్కోర్ కోసం..
సీయూసీఈటీలో అభ్యర్థులు మంచి స్కోర్ సాధించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ముఖ్యంగా హై స్కోర్ కోసం అందుకు తగ్గట్టుగా సబ్జెక్టులను ఎంచుకోవాలి. సాధారణంగా ఈ ప్రవేశ పరీక్షలో నాలుగు ప్రాథమిక విభాగాలు ఉంటాయి.
* సెక్షన్ I-A, I-B
సెక్షన్ I-Aలో13 భాషలు ఉండగా, సెక్షన్ I-Bలో 19 విభిన్న భాషలు ఉంటాయి. అభ్యర్థులు ఈ సెక్షన్ల నుండి తమకు నచ్చిన భాషలను ఎంచుకునే పూర్తి సౌలభ్యం ఉంటుంది. మాతృభాష లేదా ద్వితీయ భాషలో నైపుణ్యం ఉంటే వాటిని అభ్యర్థులు ఎంచుకోవడం ఉత్తమం. వారికి నచ్చిన నిర్దిష్ట భాషలో డిగ్రీని పొందాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా విభాగం I-B నుండి లాంగ్వేజ్ పేపర్‌ను ఎంచుకుంటే మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది.
ఈ సెక్షన్ డొమైన్-నిర్దిష్ట పరిజ్ఞానాన్ని కవర్ చేస్తుంది. ఇక్కడ 27 డొమైన్-ప్రత్యేక సబ్జెక్టులు ఉంటాయి. విద్యార్ధులు గరిష్టంగా రెండు డొమైన్-నిర్దిష్ట సబ్జెక్టులను ఎంచుకోవాలి. ఒక విద్యార్థి అండర్ గ్రాడ్యుయేట్ స్టడీ కోర్సు కోసం వన్ లాంగ్వేజ్-నిర్దిష్ట సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలంటే లేదా సాధారణ పరీక్ష సిరీస్ నుండి మూడు కోర్సులను ఎంచుకుంటే, అవి గత వాటితో సరిపోలి ఉండాలి. ప్రతి డొమైన్-నిర్దిష్ట సబ్జెక్ట్‌లో అడిగిన 50 ప్రశ్నల్లో 40 వాటిని ప్రయత్నించాలి. ప్రతి సబ్జెక్ట్ విభాగాన్ని 45 నిమిషాల్లో పూర్తి చేయాలి. 12వ తరగతి NCERT సిలబస్ ఆధారంగా ప్రశ్నలు అడగనున్నారు. కాబట్టి విద్యార్థులు అధిక స్కోర్ సాధించాలంటే నెపుణ్యం ఉన్న సబ్జెక్టులను ఎంచుకోవడం మంచిది.
* సెక్షన్- III
ఇది సాధారణ పరీక్ష భాగాన్ని కవర్ చేస్తుంది. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ అండ్ ఎనలిటికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్‌లకు సంబంధించిన ప్రశ్నలను ఈ సెక్షన్లో అడగనున్నారు. క్వాంటిటేటివ్ రీజనింగ్‌లో వివిధ మ్యాథ్స్ పార్ట్స్ నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలాగే 8వ తరగతి వరకు అకడమిక్ కోర్సును రూపొందించేందుకు అవసరమైన అంశాలపై కూడా ప్రశ్నలు అడగనున్నారు.
* ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో అత్యధిక స్కోర్ కోసం...
CUET ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఉత్తమ ఫలితాలు రావాలంటే నమూనా ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం ఒకటే మార్గం. అలాగే మరికొన్ని సూచనలు ఇలా ఉన్నాయి. నిర్దిష్ట సబ్జెక్ట్‌లకు రోజు వారీగా ప్రిపరేషన్ కోసం కచ్చితమైన సమయాన్ని కేటాయించండి. నిరంతరం అధ్యయనం చేయకుండా అప్పుడప్పుడు చిన్న విరామం తీసుకోవడానికి ప్రయత్నించండి. మీ దృష్టిని మొత్తం NCERT సిలబస్‌పై ఉంచండి. ఇలా చేస్తే సీయూఈటీ టెస్ట్‌లో ఉత్తమ ఫలితాలను రాబట్టడానికి అవకాశం ఉంటుంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.