UGC NET డిసెంబర్ సెషన్ 2022 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శుభవార్త. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) UGC NET డిసెంబర్ సెషన్ 2022 పరీక్ష కోసం ఎగ్జామ్ సెంటర్ వివరాలను యూజీసీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.inని సందర్శించడం ద్వారా అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ ద్వారా వారి ఎగ్జామ్ సెంటర్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూజీసీ నెట్-2022 డిసెంబరు పరీక్షలను ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో రెండు షిఫ్టుల్లో పరీక్ష ఉంటుంది. అయితే ఎగ్జామ్ సెంటర్ లను ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 24 వరు పరీక్ష ఉన్న అభ్యర్థులకు మాత్రమే విడుదల చేశారు.
ఎగ్జామ్ సెంటర్ స్లిప్ విడుదలైన తర్వాత.. అభ్యర్థులకు త్వరలో అడ్మిట్ కార్డులు జారీ చేయబడతాయి. UGC NET డిసెంబర్ 2022 పరీక్ష ఫిబ్రవరి 21 నుండి 10 మార్చి 2023 వరకు నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష మొత్తం 3 గంటల పాటు నిర్వహించబడుతుంది. పేపర్ 1 మరియు పేపర్ 2 మధ్య విరామం ఉండదు. పరీక్ష యొక్క మొదటి షిప్టు ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు మరియు రెండవ షిప్టు మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు నడుస్తుంది.
ఎగ్జామ్ సెంటర్ వివరాలు తెలుసుకోండిలా..
Step 1: ముందుగా అభ్యర్థులందరూ ugcnet.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Step 2: ఆపై అభ్యర్థి హోమ్‌పేజీలో “UGC-NET డిసెంబర్ 2022 కోసం అడ్వాన్స్ సిటీ ఇన్టిమేషన్” లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3: తర్వాత అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేయండి.
Step 4: ఇప్పుడు అభ్యర్థి యొక్క Exam సెంటర్ వివరాలు స్క్రీన్ పై కనపడతాయి.
Step 5: తర్వాత అభ్యర్థుల ఎగ్జామ్ సెంటర్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేయండి.
స్టెప్ 6: చివరగా.. అభ్యర్థి ఎగ్జామ్ సెంటర్ స్లిప్ ప్రింట్ అవుట్ తీసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, UGC, UGC NET, Ugc results