దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ అన్‌లాక్-4కు సిద్ధమవుతోంది కేంద్రం. ఇప్పటికే మార్గదర్శకాలను రూపొందించింది. త్వరలోనే వాటిని అధికారికంగా విడుదల చేయనుంది. ఈ సారి మెట్రో సర్వీసులకు అనుమతి ఇస్తారని సమాచారం అందుతోంది. ఐతే విద్యా సంస్థలు, సినిమా థియేటర్లను మరికొన్ని రోజులు మూసి ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో JEE (Mains), NEET (UG) పరీక్షలను వాయిదా వేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ క్లారిటీ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారమే జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ, సెప్టెంబర్ 13న నీట్ పరీక్షలను నిర్వహిస్తామని వెల్లడించింది.
National Testing Agency (NTA) says, JEE (Main) and NEET (UG) exams will be held on the dates announced earlier, which are 1st to 6th September and 13th September respectively. pic.twitter.com/TUwxjxn0tl
— ANI (@ANI) August 25, 2020
కరోనా నేపథ్యలో పరీక్షా కేంద్రాలను పెంచారు. జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాలను 570 నుంచి 660కి, నీట్ కేంద్రాలను 2546 నుంచి 3843కి పెంచారు. షిఫ్ట్‌ల సంఖ్యను కూడా 8 నుంచి 12 పెంచి.. ఒక్కో షిఫ్ట్‌కు పరీక్ష రాసే వారి సంఖ్యను తగ్గించారు. ఒక్కో షిఫ్ట్‌కు పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్యను 1.32 లక్షల నుంచి 85వేలకు తగ్గించారు. కాగా, దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షకు 8.58 లక్షల మంది విద్యార్థులు, నీట్‌కు 15.97 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు.
సెప్టెంబరు 13న నీట్ జరగనున్న నేపథ్యంలో బుధవారం నుంచి అడ్మిడ్ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఇక దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని సినీ నటుడు సోనుసూద్, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామితో పాటు పలువురు ప్రముఖులు, విద్యార్థులు కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. కరోనా కాలంలో విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని కోరారు. ఐనప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గలేదు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, JEE Main 2020, Lockdown relaxations, NEET 2020