దేశవ్యాప్తంగా ఉండే వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, మిగిలిన యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్ష నిర్వహిస్తారు. 2023 సంవత్సరానికి సంబంధించిన నీట్ యూజీ – 2023 క్యాలెండర్‌ను గతేడాది డిసెంబర్ 16న రిలీజ్ చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారం 2023 మే 7న దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష (NEET UG Exam) జరుగుతుంది. దీనికి సంబంధించి మిగిలిన వివరాలు అడ్మిషన్ ప్రక్రియ, అడ్మిట్ కార్డు ఎప్పుడు ఇస్తారు, రిజల్ట్స్ వంటి వివరాలకు సంబంధించి మిగిలిన తేదీలు ఇంకా ప్రకటించలేదు. ఇప్పటి వరకు ప్రకటించిన వివరాల ప్రకారం.. నీట్ పరీక్షను ఏడాదికి ఒక్కసారే జరగనుంది. స్టూడెంట్ యాక్టివిస్టు ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానం ఈ విషయాన్ని ధృవీకరించింది.
* నీట్ పరీక్షపై ఎందుకీ గందరగోళం
ఏడాదికి ఒక్కసారి మాత్రమే నీట్ పరీక్ష నిర్వహించడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏడాదంతా కష్టపడి చదవి ఆ ఒక్కరోజు సరిగ్గా పెర్ఫామెన్స్ చేయలేకపోవడం వల్ల సీటు రాక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పరీక్ష రాసే విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ఏడాదికి రెండు సార్లు నీట్ పరీక్ష నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చింది.
No NEET twice in a year, #NEET 2 times in a year was good option for aspirants but govt. Don't want to help #NEETUG aspirants ★As per RTI Reply: There is no change in the decision of ministry regarding the number of times the NEET to be conducted in a year #neet2023 #NEETUG2023 pic.twitter.com/nnsTiBjZKN
— Vivek pandey (@Vivekpandey21) January 26, 2023
* ఈ ఏడాదికి ఇంతే
నీట్ యూజీ (NEET UG) 2023 పరీక్ష రెండుసార్లు నిర్వహిస్తారని చాలామంది భావించారు. 2023కి సంబంధించి మే 7న (ఒక్కసారి) మాత్రమే నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ పరీక్ష తేదీ ప్రకటించింది. స్టూడెంట్ యాక్టివిస్టులు సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా ఎన్టీఏని పూర్తి సమాచారం అడిగారు. పరీక్ష షెడ్యూల్లో ఎటువంటి మార్పులు లేవని, ఒక్కసారి మాత్రమే జరుగుతుందని ఎన్టీఏ ధృవీకరించింది.
ఇది కూడా చదవండి : విద్యార్థులకు ఫిబ్రవరి నెల కీలకం.. ఈ నెలలో ముఖ్యమైన ఈవెంట్స్ ఇవే..
వివేక్ పాండే అనే యాక్టివిస్టు తన ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు. అలాగే ‘నీట్ అభ్యర్థులకు ఏడాదికి రెండుసార్లు పరీక్ష నిర్వహించడం చాలా మంచి అంశం. కానీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు’ అని వ్యాఖ్య జోడించారు. దీన్ని చూసి చాలామంది నీట్ అభ్యర్థులు నిరాశకు లోనవుతున్నారు.
* 11 ప్రాంతీయ భాషల్లో ఎగ్జామ్
NEET UG- 2023 పరీక్ష ఇంగ్లీష్, హిందీతో పాటు 11 ప్రాంతీయ భాషల్లో జరుగుతుంది. 17 ఏళ్లు ఉండి, గుర్తింపు ఉన్న బోర్డు నుంచి బయోలజీ, ఫిజిక్స్, కెమిస్ర్టీ, కోర్ సబ్జెక్టులుగా ఇంటర్ లేదా సమానమైన కోర్సులు చేసిన విద్యార్థులు నీట్ పరీక్ష రాయడానికి అర్హులు. దేశంలోని 645 మెడికల్ కాలేజీలు, 318 డెంటల్ కాలేజీలు, 914 ఆయుష్, ఇతర కళాశాలల్లో ప్రవేశానికి దీన్ని నిర్వహిస్తారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకునేవారు అధికారిక వెబ్సైట్ neet.nta.nic.inను చూడవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JOBS, NEET