Home /News /jobs /

NATIONAL TESTING AGENCY OPENS APPLICATION WINDOW FOR UGC NET DECEMBER 2020 AND JUNE 2021 SESSIONS SS

UGC NET 2021: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది... ఒకేసారి రెండు పరీక్షలు

UGC NET 2021: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది... ఒకేసారి రెండు పరీక్షలు
(ప్రతీకాత్మక చిత్రం)

UGC NET 2021: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది... ఒకేసారి రెండు పరీక్షలు (ప్రతీకాత్మక చిత్రం)

UGC NET 2021 | యూజీసీ నెట్ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులకు అలర్ట్. యూజీసీ నెట్ 2020 డిసెంబర్ సెషన్, 2021 జూన్ సెక్షన్ ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.

    నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA 2020 డిసెంబర్ సెషన్, 2021 జూన్ సెషన్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే 2020 డిసెంబర్ సెషన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తైంది. పరీక్ష ఇంకా జరగలేదు. 2021 జూన్ సెషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఈ రెండు పరీక్షలు ఎప్పుడో పూర్తై, ఫలితాలు కూడా రావాల్సింది. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. దీంతో ఈ రెండు పరీక్షల్ని ఒకేసారి నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA నిర్ణయించింది. "కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 డిసెంబర్ యూజీసీ నెట్ వాయిదా వేసినందుకు 2021 జూన్ యూజీసీ నెట్ ఆలస్యమైంది. యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సైకిల్ రెగ్యులరైజే చేసేందుకు 2020 డిసెంబర్ సెషన్, 2021 జూన్ సెషన్ పరీక్షల్ని కలిపి నిర్వహించాలని నిర్ణయించాం" అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA ప్రకటించింది.

    ఇప్పటికే 2020 డిసెంబర్ సెషన్ దరఖాస్తుల్ని స్వీకరించింది కాబట్టి, 2021 జూన్ సెషన్ దరఖాస్తు ప్రక్రియ తాజాగా ప్రారంభించింది. 2021 సెప్టెంబర్ 5 వరకు దరఖాస్తు చేయొచ్చు. 2021 అక్టోబర్ 6 నుంచి రెండు పరీక్షలు ఒకేసారి జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్ట్ ఎగ్జామ్ ఉంటుంది. యూజీసీ నెట్ 2020 డిసెంబర్ సెషన్‌కు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, దరఖాస్తు పూర్తి చేయని అభ్యర్థులు కూడా ఇప్పుడు అప్లై చేయొచ్చు. 2021 సెప్టెంబర్ 6 లోగా ఫీజు చెల్లించాలి. సెప్టెంబర్ 7 నుంచి 12 వరకు అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. అభ్యర్థులు https://ugcnet.nta.nic.in/ లేదా https://www.nta.ac.in/ వెబ్‌సైట్లలో దరఖాస్తు చేయొచ్చు.

    Telangana Jobs: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ జాబ్ నోటిఫికేషన్... నేటి నుంచి దరఖాస్తులు

    UPSC CDS 2021: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్‌లో జాబ్స్... 339 ఖాళీలు

    UGC NET 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 10
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 5 రాత్రి 11.50 గంటలు
    దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 6 రాత్రి 11.50 గంటలు
    దరఖాస్తులు సరిదిద్దుకోవడానికి అవకాశం- 2021 సెప్టెంబర్ 7 నుంచి 12
    అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్- తేదీ త్వరలో వెల్లడించనున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
    పరీక్ష తేదీ- 2021 అక్టోబర్ 6 నుంచి 11
    ఫస్ట్ షిఫ్ట్- ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు
    సెకండ్ షిఫ్ట్- మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
    విద్యార్హతలు- ఏదైనా సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయినవారు లేదా చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేయొచ్చు.
    దరఖాస్తు ఫీజు- జనరల్ అభ్యర్థులకు రూ.1000. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250.
    వయస్సు- జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం 2021 అక్టోబర్ 1 నాటికి 31 ఏళ్లు దాటకూడదు. ఓబీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్, మహిళలకు ఐదేళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. ఏజ్ లిమిట్ ప్రస్తుత ఎగ్జామ్‌కు మాత్రమే. అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం గరిష్ట వయో పరిమితి లేదు.

    RRB Group D Jobs: త్వరలో 1,03,769 రైల్వే జాబ్స్‌కు ఎగ్జామ్... ఏం చదవాలంటే

    BSF Constable Jobs 2021: రూ.69,100 వేతనంతో బీఎస్‌ఎఫ్‌లో 269 కానిస్టేబుల్ ఉద్యోగాలు... టెన్త్ పాస్ అయితే చాలు

    ఇక నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-NET విషయానికి వస్తే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC ప్రతీ ఏటా రెండుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. షెడ్యూల్ ప్రకారం జూన్, డిసెంబర్‌లో పరీక్షలు జరుగుతాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఆర్ఎఫ్ లాంటివాటికి అర్హత సాధించాలంటే యూజీసీ నెట్ క్వాలిఫై కావడం తప్పనిసరి. జేఆర్ఎఫ్ అర్హత సాధిస్తే మొదటి రెండేళ్ల పాటు నెలకు రూ.25,000 పారితోషికం పొందొచ్చు. రెండేళ్ల వ్యవధిలో అభ్యర్థి ప్రోగ్రెస్ పరిశీలించిన తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అందిస్తారు. మూడేళ్ల పాటు నెలకు రూ.25,000 పారితోషికం లభిస్తుంది. యూజీసీ నెట్ క్వాలిఫై అయినవారికి ఈ పరీక్షలో సాధించిన స్కోర్ ఆధారంగా ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, National Testing Agency, UGC, UGC NET

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు