NTA UGC NET 2019: మే 27న యూజీసీ నెట్ హాల్ టికెట్స్ రిలీజ్... డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

NTA UGC NET 2019 Admit Card | అడ్మిట్ కార్డులు మే 27 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని NTA వెల్లడించింది. NTA అధికారిక వెబ్‌సైట్ ntanet.nic.in ఓపెన్ చేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: May 22, 2019, 6:20 PM IST
NTA UGC NET 2019: మే 27న యూజీసీ నెట్ హాల్ టికెట్స్ రిలీజ్... డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(NET)కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మే 27 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూజీసీ నెట్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తోంది. అడ్మిట్ కార్డులు మే 27 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని NTA వెల్లడించింది. NTA అధికారిక వెబ్‌సైట్ ntanet.nic.in ఓపెన్ చేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూజీసీ నెట్ జూన్ 20, 21, 24, 25, 26, 27, 28, తేదీల్లో నిర్వహించనుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.

NTA UGC NET 2019: అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా...



ముందుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌‌సైట్ ntanet.nic.in ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో కనిపించే 'admit card 2019' లింక్ పైన క్లిక్ చేయండి.
మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ లాంటి వివరాలను ఎంటర్ చేయండి.
చివరగా సబ్మిట్ పైన క్లిక్ చేస్తే అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.అడ్మిట్ కార్డ్ లేకుండా పరీక్ష హాలుకు అనుమతించరు.

NTA UGC NET 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


పరీక్షకు అడ్మిట్ కార్డ్ తీసుకెళ్లడం తప్పనిసరి.
అడ్మిట్ కార్డుతో పాటు ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్లాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌లో అప్‌లోడ్ చేసిన ఫోటోనే ఉండాలి.
ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డ్ తీసుకెళ్లాలి. పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్(ఫోటోతో ఉండాలి), ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్, రేషన్‌కార్డుల్లో ఏదైనా తీసుకెళ్లొచ్చు.
పరీక్షా కేంద్రానికి పరీక్షా సమయానికంటే రెండు గంటల ముందే వెళ్లాలి.
మొదటి షిఫ్ట్‌లో ఉదయం 8.30 గంటలు, రెండో షిఫ్ట్‌లో మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత అభ్యర్థుల్ని పరీక్షా కేంద్రానికి అనుమతించరు.
యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించి ఏదైనా సాయం కావాలంటే 8076535482 లేదా 7703859909 నెంబర్‌కు కాల్ చేయొచ్చు.

Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ రిలీజ్... ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

LIC Jobs: ఎల్ఐసీలో 8581 ఏడీఓ పోస్టులు... హైదరాబాద్ జోన్‌లో 1251 ఖాళీలు

EPFO Jobs: డిగ్రీ పాసైతే చాలు... ఈపీఎఫ్ఓలో 280 ఉద్యోగాలు

Railway Jobs: కోచ్ ఫ్యాక్టరీలో 992 అప్రెంటీస్ పోస్టులు... టెన్త్ పాసైనవారికీ అవకాశం
First published: May 22, 2019, 2:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading