JEE Main Admit Card 2020: జేఈఈ మెయిన్ 2020 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయండి ఇలా

JEE Main 2020 Admit Card | దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో జనవరి 6 నుంచి జనవరి 11 వరకు జేఈఈ మెయిన్ 2020 ఎగ్జామ్ జరగనుంది. ఫలితాలు 2020 జనవరి 31న రిలీజ్ కానున్నాయి.

news18-telugu
Updated: December 6, 2019, 1:58 PM IST
JEE Main Admit Card 2020: జేఈఈ మెయిన్ 2020 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయండి ఇలా
JEE Main Admit Card 2020: జేఈఈ మెయిన్ 2020 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
జేఈఈ మెయిన్ పరీక్షలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు శుభవార్త. జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు కాసేపట్లో రిలీజ్ కానుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్ జనవరి 2020 పరీక్షను నిర్వహించనుంది. jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో జనవరి 6 నుంచి జనవరి 11 వరకు జేఈఈ మెయిన్ 2020 ఎగ్జామ్ జరగనుంది. ఫలితాలు 2020 జనవరి 31న రిలీజ్ కానున్నాయి.

JEE Main Admit Card 2020: డౌన్‌లోడ్ చేయండి ఇలా...



ముందుగా ఎన్‌టీఏ జేఈఈ మెయిన్ 2020 అధికారిక వెబ్‌సైట్ jeemain.nic.in ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో JEE Main 2020 admit card లింక్ క్లిక్ చేయండి.
మీ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్, పిన్ ఎంటర్ చేయండి.
చివరగా సబ్మిట్ పైన క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
హాల్ టికెట్ ప్రింట్ తీసుకొని ఇన్‌స్ట్రక్షన్స్ చదవాలి.ఎన్‌టీఏ జేఈఈ మెయిన్ 2020 అడ్మిట్ కార్డ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వచ్చే అకడమిక్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రెండు సార్లు జేఈఈ మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. మొదటి జేఈఈ మెయిన్ 2020 జనవరిలో, రెండో జేఈఈ మెయిన్ ఏప్రిల్‌లో ఉంటుంది. ఒక అభ్యర్థి ఈ రెండు పరీక్షలకూ హాజరు కావచ్చు. ఏ పరీక్షలో మార్కులు ఎక్కువగా వస్తే ఆ మార్కులనే అడ్మిషన్ సమయంలో పరిగణలోకి తీసుకుంటారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-NIT, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-IIT విద్యాసంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో అడ్మిషన్ కోసం జేఈఈ మెయిన్ పరీక్ష రాస్తుంటారు విద్యార్థులు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo S1: వివో ఎస్1 ధర తగ్గింది... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Indian Air Force Jobs: ఎయిర్ ఫోర్స్‌లో 249 ఖాళీలు... హైదరాబాద్‌లో ట్రైనింగ్

BHEL Recruitment 2019: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

HAL Recruitment 2019: హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్‌లో జాబ్స్

 
First published: December 6, 2019, 1:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading