• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • NATIONAL TESTING AGENCY NTA RELEASED THE HALL TICKETS FOR JEE MAIN 2021 HERE FULL DETAILS NS

JEE Main 2021 హాల్ టికెట్లు విడుదల.. ఈ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) గురువారం జేఈఈ మెయిన్ 2021 మార్చి సెషన్ కు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) గురువారం జేఈఈ మెయిన్ 2021 మార్చి సెషన్ కు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పరీక్షకు అప్లై చేసిన విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని NTA సూచించింది. అధికారిక వెబ్ సైట్ https://jeemain.nta.nic.in/ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, సెక్యురిటీ పిన్ తదితర వివరాలను నమోదు చేసి అడ్మిట్ కార్డును డౌడ్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ పరీక్ష మార్చి 16 నుంచి 18 వరకు జరగనుంది. దేశ వ్యాప్తంగా 331 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

    అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోండిలా..
    -విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
    -అనంతరం అడ్మిట్ కార్డు లింక్ పై క్లిక్ చేయాలి.
    -దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
    -ఏ పేజీలో సూచించిన బాక్సుల్లో అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీ పిన్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
    -అనంతరం నమోదు చేసిన వివరాలను ఒక సారి చెక్ చేసుకోవాలి.
    -తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
    -అనంతరం స్క్రీన్ పై అడ్మిట్ కార్డు కనిపిస్తుంది. దానిని ప్రింట్ తీసుకోవాలి.
    -అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే అభ్యర్థులు 011- 40759000 నంబరును సంప్రదించవచ్చు. లేదా jeemain@nta.ac.inకు ఈ మెయిల్ చేయవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published: