వైద్య విద్యను అభ్యసించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న లక్షలాది మంది విద్యార్థులు ఏళ్లుగా ఎదురు చూస్తున్న నీట్ (UG) - 2022 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. అర్హతచ ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 6వ తేదీ నుంచి మే 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు మే 7వ తేదీ రాత్రి 11:50 గంటల వరకు ఫీజు చెల్లించుకోవచ్చు. నీట్ ఎగ్జామ్ ను జులై 17వ తేదీ ఆదివారం నిర్వహించనున్నట్లు NTA తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.nta.ac.in, neet.nta.nic.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.1600, జనరల్-EWS, ఓబీసీ-NCL అభ్యర్థులు రూ.1500, SC/ST/PwBD అభ్యర్థులు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది.
ఇకా పరీక్ష విషయానికి వస్తే.. ఎగ్జామ్ జులై 17న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంతం 5:20 గంటల వరకు అంటే 3 గంటల 20 నిమిషాల పాటు నిర్వహించనున్నారు. ఈ సమయంలో మొత్తం 200 ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే.. జేఈఈ పరీక్షలకు సంబంధించిన తేదీలు మళ్లీ మారాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇందుకు సంబంధించిన తేదీలను వెల్లడించింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ సెషన్ 1 ఎగ్జామ్స్ ఏప్రిల్ 21, 24, 25, 29, మరియు మే 1, 4 తేదీల్లో జేఈఈ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. అయితే జూన్ 20, 21, 22, 23, 24, 26, 26, 27, 28, 29 తేదీలకు ఈ ఎగ్జామ్స్ ను మార్చినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా సెషన్ 2 కు సంబంధించి ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆ ఎగ్జామ్స్ ను జులై 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 మరియు 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు తాజా ప్రకటనలో పేర్కొన్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.