హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Teacher Jobs: మొత్తం 3400 టీచర్ ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

Teacher Jobs: మొత్తం 3400 టీచర్ ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

Teacher Jobs: మొత్తం 3400 టీచర్ ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Teacher Jobs: మొత్తం 3400 టీచర్ ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Eklavya Model School Recruitment 2021 | ఏకలవ్య స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

  ఉపాధ్యాయ వృత్తి ఎంచుకున్నవారికి శుభవార్త. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మొత్తం 3400 టీచర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అందులో ప్రిన్సిపాల్ పోస్టులు 175, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు 116, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 1244, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 1944 ఉన్నాయి. తెలంగాణలో 262, ఆంధ్రప్రదేశ్‌లో 117 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://tribal.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత విద్యార్హతలు ఉంటేనే దరఖాస్తు చేయాలి. ప్రిన్సిపాల్ పోస్టుకు ఏదైనా స్కూలింగ్ సబ్జెక్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా టీచింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. 10 ఏళ్లు ఇంగ్లీష్ మీడియం హయ్యర్ సెకండరీ స్కూల్ టీచర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. టీజీటీ, పీజీటీ పోస్టుకు మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ పాస్ కావాలి. https://recruitment.nta.nic.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహిస్తోంది.

  APCPDCL: ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  ECIL Recruitment 2021: ఈసీఐఎల్‌లో 111 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  Eklavya Model School Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా


  అభ్యర్థులు ముందుగా https://recruitment.nta.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  అందులో EMRS Teaching Staff Selection Exam (ETSSE)-2021 నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.

  కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

  అందులో APPLY FOR EMRS TEACHING STAFF SELECTION EXAM 2021 పైన క్లిక్ చేయాలి.

  కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

  అందులో New Registration పైన క్లిక్ చేయాలి.

  ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి. నియమనిబంధనల్ని అంగీకరిస్తూ టిక్ మార్క్ చేయాలి.

  ఆ తర్వాత Click here to Proceed పైన క్లిక్ చేయాలి.

  అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.

  అందులో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.

  సబ్మిట్ చేసిన తర్వాత ఓసారి వివరాలు సరిచూసుకొని రిజిస్ట్రేషన్ చేయాలి.

  ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ జనరేట్ అవుతుంది.

  తర్వాత విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

  ఆ తర్వాత ఫోటో, సంతకం, వేలిముద్ర లాంటి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

  చివరగా దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

  BHEL Jobs 2021: బీహెచ్ఈఎల్‌లో 389 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

  NTA Recruitment 2021: మొత్తం 1145 పోస్టుల భర్తీకి మళ్లీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

  ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టుకు రూ.2,000. పీజీటీ, టీజీటీ పోస్టుకు రూ.1,500 ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు ఏప్రిల్ 30 లోగా అప్లై చేయాలి. దరఖాస్తు ఫీజు 2021 మే 1 రాత్రి 11.50 గంటల్లోగా చెల్లించాలి. దరఖాస్తులో తప్పులు సరిదిద్దుకోవడానికి 2021 మే 4 నుంచి 6 వరకు అవకాశం ఉంటుంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, CAREER, Exams, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

  ఉత్తమ కథలు