• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • NATIONAL TESTING AGENCY NTA HAS RELEASED THE ANSWER KEY JEE MAIN 2021 FOR MARCH SESSION NS

JEE Main March 2021: జేఈఈ మెయిన్ ఆన్సర్ కీ విడుదల.. ఈ లింక్ తో డౌన్ లోడ్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

JEE Main March 2021 Answer Key: జేఈఈ మెయిన్ మార్చి సెషన్ కు సంబంధించిన ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జేఈఈ మెయిన్ 2021(JEE Main 2021) మార్చి సెషన్ పరీక్ష ఆన్సర్ కీని విడుదల చేసింది. ఇది ప్రిలిమినరీ కీ, విద్యార్థులు ఈ కీ పైన తమ అభ్యంతరాలను వ్యక్తం చేయవచ్చు. అభ్యర్థులు మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు తమ అభ్యంతరాలను వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. JEE Main March 2021 మార్చి సెషన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.jeemain.nta.nic.in లో లాగిన్ అయ్యి కీని చూసుకోవచ్చు. అభ్యర్థులు ఎవరైనా కీలో సమాధానం ఏదైనా తప్పుగా ఉందని భావిస్తే సంబంధిత ప్రూఫ్ తో తమ అభ్యంతరాలను వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం ఫీజు కూడా చెల్లించాలి.

    ఆన్సర్ కీని ఎలా డౌన్ లోడ్ చేయాలంటే..
    -అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.inను ఓపెన్ చేయాలి.
    -అనంతరం మీకు Display Question Paper and Answer Key Challenge March Session లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
    -కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ తదితర లాగిన్ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
    -అనంతరం జేఈఈ మెయిన్ ఆన్సర్ కీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

    -ఎన్టీఏ(NTA) జేఈఈ మెయిన్ కు సంబంధించిన అన్ని షిఫ్ట్ ల ప్రశ్నా పత్రాలను సైతం విడుదల చేసింది. విద్యార్థుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని తుది కీని విడుదల చేయనున్నారు. మరో రెండు సార్లు ఈ ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహించనున్నారు. నెక్స్ట్ సెషన్ ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించనున్నారు. ఎన్టీఏ జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ అప్లికేషన్ విండో త్వరలో ఓపెన్ కానుంది.
    Published by:Nikhil Kumar S
    First published: