• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • NATIONAL TESTING AGENCY NTA HAS OPENED THE REGISTRATION WINDOW FOR THE JOINT ENTRANCE EXAMINATION JEE MAIN 2021 APRIL SESSION NS

JEE Main 2021: జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

జేఈఈ మెయిన్ ఫిబ్రవరి, మార్చి సెషన్ పరీక్షల్లో తక్కువ స్కోర్ సాధించామని లేక ఆయా పరీక్షలకు హాజరు కాలేక పోయామని బాధ పడుతున్నారా? అయితే ఏప్రిల్ సెషన్ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. తద్వారా మంచి స్కోర్ సాధించవచ్చు.

  • Share this:
    జేఈఈ మెయిన్ పరీక్షలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ సెషన్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ సెషన్ పరీక్ష రాయాలనుకుంటున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.inలో రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్ష ఏప్రిల్ 27 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష అనంతరం మే సెషన్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పటికే ఫిబ్రవరి, మార్చి సెషన్ కు సంబంధించిన పరీక్షల ఫలితాలను NTA తన వెబ్ సైట్లో విడుదల చేసింది. ఈ రెండు సెషన్లకు హాజరు కాని అభ్యర్థులు లేదా స్కోర్ ను పెంచుకోవాలనుకుంటున్న వారు ఏప్రిల్ సెషన్ కు అప్లై చేసుకోవచ్చు.

    ఎలా అప్లై చేయాలంటే..
    -అభ్యర్థులు మొదటగా జేఈఈ మెయిన్ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.inను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
    -హోం పేజీలో ‘JEE Main- New Registration and Registration Form Correction’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    -అనంతరం ‘New Registration’పై క్లిక్ చేయాలి.
    -యూజర్ ఐడీ, పాస్వర్డ్ ను జనరేట్ చేయాలి. అనంతరం అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయాలి.
    -అనంతరం కావాల్సిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయండి.
    -కన్ఫర్మేషన్ పేజీని డౌన్ లోడ్ చేసుకుని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి. జేఈఈ మెయిన్ 2021 ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఫార్మాట్లో నిర్వహించబడుతుంది.
    Published by:Nikhil Kumar S
    First published: