JEE Main 2020: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... జేఈఈ మెయిన్ దరఖాస్తు ప్రారంభం

JEE Main 2020 | మొదటి జేఈఈ మెయిన్ 2020 జనవరిలో, రెండో జేఈఈ మెయిన్ ఏప్రిల్‌లో ఉంటుంది. ప్రస్తుతం జనవరిలో నిర్వహించే పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

news18-telugu
Updated: September 3, 2019, 4:29 PM IST
JEE Main 2020: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... జేఈఈ మెయిన్ దరఖాస్తు ప్రారంభం
JEE Main 2020: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... జేఈఈ మెయిన్ దరఖాస్తు ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 3, 2019, 4:29 PM IST
జేఈఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. జేఈఈ మెయిన్ 2020 పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA. గతంలోనే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 2న ప్రారంభం కావాల్సింది. కానీ ఒకరోజు ఆలస్యంగా సెప్టెంబర్ 3న దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. jeemain.nic.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివేట్ అయింది. దరఖాస్తుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ. వచ్చే ఏడాది మొదలయ్యే అకడమిక్ సీజన్ కంటే ముందే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రెండు సార్లు జేఈఈ మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. మొదటి జేఈఈ మెయిన్ 2020 జనవరిలో, రెండో జేఈఈ మెయిన్ ఏప్రిల్‌లో ఉంటుంది. ప్రస్తుతం జనవరిలో నిర్వహించే పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఒక అభ్యర్థి ఈ రెండు పరీక్షలకూ హాజరు కావచ్చు. ఏ పరీక్షలో మార్కులు ఎక్కువగా వస్తే ఆ మార్కులనే అడ్మిషన్ సమయంలో పరిగణలోకి తీసుకుంటారు. జేఈఈ మెయిన్ పరీక్షలకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

JEE Main 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే...


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 సెప్టెంబర్ 3

దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 30
జేఈఈ మెయిన్ 2020 ఎగ్జామ్- 2020 జనవరి 6 నుంచి 11 వరకు
ఫలితాల విడుదల- 2020 జనవరి 31



నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-NIT, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-IIT విద్యాసంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో అడ్మిషన్ కోసం జేఈఈ మెయిన్ పరీక్ష రాస్తుంటారు విద్యార్థులు.
Loading...
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Jobs: 106 నాన్-టీచింగ్ స్టాఫ్ పోస్టులకు నోటిఫికేషన్... వివరాలివే

Jobs: కేంద్ర జౌళి శాఖలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Jobs: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో జాబ్స్... వివరాలివే
First published: September 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...