NATIONAL TESTING AGENCY ADDS NEW SUBJECT AND HIKES EXAM FEES IN UGC NET 2022 KNOW ABOUT KEY CHANGES SS GH
UGC NET: కొత్త సబ్జెక్ట్... కొత్త ఫీజ్... ఈసారి యూజీసీ నెట్లో మార్పులు ఇవే
UGC NET: కొత్త సబ్జెక్ట్... కొత్త ఫీజ్... ఈసారి యూజీసీ నెట్లో మార్పులు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
UGC NET 2022 | ఈసారి యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించి కొన్ని మార్పులు చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA). యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఈ మార్పుల్ని దృష్టిలో పెట్టుకోవాలి.
యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) డిసెంబర్ 2021, జూన్ 2022 రెండిటికి సంబంధించి సంయుక్తంగా నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( NTA) గత నెల ఏప్రిల్ 30న నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు UGC NET 2022 పరీక్ష కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది నెట్‌కు సంబంధించి కొన్ని కీలక మార్పులను ఎన్టీఏ చేపట్టింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
UGC నెట్ ఫీజు వివరాలు
ఈసారి 2021 డిసెంబర్, 2022 జూన్ ఎడిషన్స్ రెండిటికీ సంయుక్తంగా నెట్ పరీక్షను నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. రెండు ఎడిషన్లకు ఒకే పరీక్ష కాబట్టి, దరఖాస్తు రుసుమును పెంచింది. 10 శాతం పెంపుతో జనరల్ కేటగిరీ లేదా అన్రిజర్వ్డ్ కేటగిరీ దరఖాస్తుదారులు రూ.1,100 చెల్లించాల్సి ఉంటుంది. వీరికి గతేడాది రూ.1,000 మాత్రమే రుసుము ఉండేది. ఇక EWS, OBC-NCL కెటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. 50 పెంపుతో రూ.550 చెల్లించాల్సి ఉంది. SC, ST, PwD, ట్రాన్స్జెండర్ల దరఖాస్తు రుసుమును రూ. 25 పెంచారు. దీంతో ఇది ఇప్పుడు రూ.275కు చేరింది.
యూజీసీ నెట్ పరీక్షను ఇప్పటివరకు 81 సబ్జెక్టుల్లో నిర్వహించారు. అయితే ఈసారి మాత్రం మరో సబ్జెక్టును జోడించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC). సమాచార బులెటిన్ ప్రకారం.. UGC సబ్జెక్టు జాబితాకు 'హిందూ అధ్యయనాలు' (సబ్జెక్ట్ కోడ్ 102) అనే కొత్త సబ్జెక్ట్‌ని జోడించింది. దీంతో UGC NET దరఖాస్తు ఫారమ్‌ను పూరించేటప్పుడు అభ్యర్థులు ఇప్పుడు 82 విభాగాల జాబితా నుండి ఎంచుకోవచ్చు.
పరీక్ష నిర్వహించే నగరాల పెంపు
ఈసారి జరిగే యూజీసీ నెట్ -2022 పరీక్షను అదనంగా మరికొన్ని నగరాల్లో నిర్వహించనున్నారు. ఈ ఏడాది దాదాపు 541 నగరాల్లో పరీక్ష జరగనుంది. గతేడాది కేవలం 239 నగరాల్లో మాత్రమే నిర్వహించారు. పరీక్ష నగరాల పూర్తి జాబితాను ఎన్టీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే.
పరీక్షకు సంబంధించిన అభ్యంతరాలను నివేధించడానికి దరఖాస్తుదారులకు ఏన్టీఏ అనుమతించింది. ఇందు కోసం పరీక్ష ముగిసిన వెంటనే ప్రశ్నాపత్రానికి సంబందించిన ప్రాథమిక ఆన్సర్ కీను ఎన్టీఏ విడుదల చేయనుంది. అభ్యర్థులు గతంలో ప్రతి ఛాలెంజ్‌కు రూ. 1,000 చొప్పున తాత్కాలిక సమాధాన కీని సవాలు చేసేవారు. ఇప్పుడు ఒక్కో ఛాలెంజ్‌కు కేవలం రూ.200 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
పరీక్ష విధానం
యూజీసీ నెట్ -2022 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే20గా ఎన్టీఏ నిర్ణయించింది. పరీక్ష కంప్యూటర్ మోడ్‌లో జరగనుంది. రెండు షిఫ్టుల్లో 180 నిమిషాలు లేదా మూడు గంటల పాటు జరగనుంది. మొదటి షిప్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు, రెండోది మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. పేపర్ I 100 మార్కులకు, పేపర్ IIను ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ ఫార్మాట్లో 200 మార్కులకు నిర్వహించనున్నారు. అన్ని ప్రశ్నలను ప్రయత్నించడం తప్పనిసరి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. పరీక్ష ఇంగ్లీష్ , హిందీ మీడియంలో మాత్రమే జరగుతుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.