నీట్, జేఈఈ విద్యార్థుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్... ఫీచర్స్ ఇవే

National Test Abhyaas app | నీట్, జేఈఈ మెయిన్స్ విద్యార్థులు పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు నేషనల్ టెస్ట్ అభ్యాస్ యాప్‌ను రూపొందించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.

news18-telugu
Updated: May 22, 2020, 3:47 PM IST
నీట్, జేఈఈ విద్యార్థుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్... ఫీచర్స్ ఇవే
నీట్, జేఈఈ విద్యార్థుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్... ఫీచర్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నీట్, జేఈఈ విద్యార్థులకు శుభవార్త. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ-MHRD నేషనల్ టెస్ట్ అభ్యాస్ యాప్‌ను ప్రారంభించింది. నీట్, జేఈఈ మెయిన్ 2020 ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడే యాప్ ఇది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA ఈ యాప్‌ను రూపొందించింది. విద్యార్థులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 19 ఎంబీ సైజ్ గల ఈ యాప్‌ను ఇప్పటికే 1,00,000 మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకోవడం విశేషం. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్స్‌లో ఈ యాప్ పనిచేస్తుంది. త్వరలో ఐఓఎస్ వర్షన్ కూడా రిలీజ్ కానుంది. కోవిడ్ 19 లాక్‌డౌన్ కారణంగా విద్యాసంస్థలు, ఇన్‌స్టిట్యూట్స్ మూతపడటం వల్ల విద్యార్థులు ప్రాక్టీస్ టెస్టుల్ని కోల్పోకూడదన్న ఉద్దేశంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ యాప్‌ను రూపొందించింది.


నేషనల్ టెస్ట్ అభ్యాస్ యాప్‌ పూర్తిగా ఉచితం. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత బేసిక్ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. ఇందులో ప్రాక్టీస్ టెస్టులు, ఎగ్జామ్ పేపర్స్ అందుబాటులో ఉంటాయి. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న విద్యార్థులైనా తమ స్మార్ట్‌ఫోన్‌లో వీటిని యాక్సెస్ చేయొచ్చు. మాక్ టెస్టుల్ని డౌన్‌లోడ్ చేసుకొని ఇంటర్నెట్ లేని సమయంలో కూడా ఆఫ్‌లైన్‌లో ప్రాక్టీస్ చేయొచ్చు. జేఈఈ మెయిన్ 2020, నీట్ విద్యార్థులు మూడు గంటల పూర్తి ప్రశ్నాపత్రాన్ని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. విద్యార్థులు పరీక్ష పూర్తి చేసిన వెంటనే స్కోర్స్ తెలుసుకోవచ్చు. ఆ ప్రశ్నలకు జవాబులు, వివరణలు కూడా ఉంటాయి. ఏఏ సెక్షన్‌లో ఎంత సమయం పట్టిందని కూడా విశ్లేషించుకోవచ్చు. మరి మీరు కూడా నేషనల్ టెస్ట్ అభ్యాస్ యాప్‌ డౌన్‌లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Andhra Pradesh Jobs: విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో 193 ఉద్యోగాలుJobs: కరోనా కష్టకాలంలో కూడా ఈ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్
First published: May 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading