ఫైనాన్షియల్ మార్కెట్ రంగాన్ని కెరీర్‌గా మలుచుకుంటున్న వారి సంఖ్య దేశంలో నానాటికీ పెరిగిపోతోంది. ఈ రంగంలో నిపుణులు, ఉద్యోగుల సంఖ్య అధికమవుతోంది. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతోంది. ఈ తరుణంలో కొత్త టెక్నాలజీల గురించి లోతైన అవగాహన, పూర్తి సమాచారం మార్కెట్ ప్రొఫెషనల్స్కు ఎంతో అవసరం. ముఖ్యంగా మార్కెట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పాత్ర గురించి అవగాహన ఉండాల్సిందే. ఇలాంటి వారి కోసమే జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ పరిధిలోని ఎన్ఎస్ఈ అకాడమీ కొత్త కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. టాలెంట్ స్ప్రింట్‌తో కలిసి అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం ఇన్ ఏఐ ఫైనాన్షియల్ మార్కెట్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది.
ఈ కోర్సు వ్యవధి ఆరు నెలలు. హెడ్జ్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు, కమోడిటీ మార్కెట్లు, డెరివేటివ్స్, ఇన్సూరెన్స్, ఫారెక్స్, మనీ మార్కెట్, ఫిన్టెక్ స్టార్టప్స్, ఎన్బీఎఫ్సీలు, రెగ్యులేటరీల్లో ఏఐ ఎక్స్పర్ట్గా మారేందుకు ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది. మార్కెట్ రంగంలోని టాప్ విద్యాసంస్థలకు చెందిన అధ్యాపకులు, ప్రముఖులు ఈ కోర్సులో పాఠాలు బోధించనున్నారని టాలెంట్ స్ప్రింట్ వెల్లడించింది.
DRDO Recruitment 2021: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు
Deutsche Bank: ఇండియాలో 1,000 మందిని నియమించుకోనున్న జర్మన్ బ్యాంకింగ్ దిగ్గజం
ఈ కోర్సు మొదటి విడత ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఈ కోర్సు ఫీజు రూ.3లక్షలు కాగా.. 30 శాతం స్కాలర్‌షిప్‌గా పొందే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు డిజిటల్ వైపునకు మారుతున్నాయి. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పాత్ర పెరుగుతోంది. ఆర్థమెటిక్ ట్రేడింగ్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, మార్కెట్ విశ్లేషణ, ఇంటెలిజెంట్ ఫోర్కాస్టింగ్, క్యాపిటల్ ఆప్టిమైజైషన్, రిస్క్ మేనేజ్మెంట్, కస్టమర్ సర్వీస్ ఇలా ప్రతీ విషయంలోనూ ఏఐ, ఎంఎల్ సొల్యూషన్లు పాత్ర పోషిస్తున్నాయి. అలాగే మార్కెట్లలో ఏఐ టెక్నాలజీస్ గురించి తెలిసిన నిపుణులు చాలా తక్కువ మంది ఉన్నారని ఎడ్టెక్ ప్లాట్ఫామ్ వెల్లడించింది. ఏఐ టెక్నాలజీని నేర్చుకున్న వారికి మంచి డిమాండ్ ఉందని చెప్పింది.
IBPS RRB Jobs 2021: మొత్తం 10,676 బ్యాంకు ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
India Post GDS Results 2021: తెలంగాణ, ఏపీ గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల ఫలితాలు ఎప్పుడంటే...
"ఆర్థిక మార్కెట్లలో అత్యుత్తమమైన విద్యను అందించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధిని వేగవంతం చేయాలన్నదే మా లక్ష్యం. టాలెంట్ స్ర్పింట్ భాగస్వామ్యంతో అందుకోసం కృషి చేస్తున్నాం" అని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో విక్రమ్ లిమయే తెలిపారు.
మరోవైపు ప్రొఫెషనల్స్‌తో పాటు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారి కోసం కూడా చాలా కోర్సులు వస్తున్నాయి. షేర్మార్కెట్లతో పాటు ఆర్థిక మార్కెట్లలోని వివిధ విభాగాల గురించి కోర్సులు ఉన్నాయి. ఇటీవల షేర్స్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య కూడా పెరుగుతుండడంతో ఫైనాన్షియల్ కోర్సులకు మంచి ఆదరణ లభిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.