హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NSDC: కెరీర్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నారా..? అయితే, ఈ ఫ్రీ వర్క్ షాప్ మీ కోసమే..

NSDC: కెరీర్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నారా..? అయితే, ఈ ఫ్రీ వర్క్ షాప్ మీ కోసమే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NSDC: 18 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న యువకులు తమ కెరీర్‌లో ముందుకు సాగడానికి ఈ వర్క్‌షాప్‌ ఎంతో దోహదపడుతుంది. వారంలో మూడు రోజులు జరిగే ఈ వర్క్ షాప్ ఆఫ్ లైన్, ఆన్‌లైన్ మోడ్‌లో అందుబాటులో ఉండనుంది.

నేషనల్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) జెట్‌కింగ్ ఇన్ఫోట్రెయిన్ లిమిటెడ్‌తో కలిసి డిజిటల్ స్కిల్స్(Digital Skills) ట్రైనింగ్ కోసం ఉచిత వర్క్‌షాప్‌(Free Training Workshop)ను నిర్వహిస్తుంది. వారంలో మూడు రోజులు జరిగే ఈ వర్క్ షాప్ ఆఫ్ లైన్, ఆన్‌లైన్ మోడ్‌లో అందుబాటులో ఉండనుంది. దేశవ్యాప్తంగా ఉన్న జెట్‌కింగ్ సెంటర్లలో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నారు. ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చెయిన్, క్రిప్టో కరెన్సీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అంశాలపై వర్క్‌షాప్‌లో అవగాహన కల్పించనున్నారు.

18 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న యువకులు తమ కెరీర్‌లో ముందుకు సాగడానికి ఈ వర్క్‌షాప్‌ ఎంతో దోహదపడుతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకారం... రేపటి తరం వర్క్‌ఫోర్స్ కోసం నైపుణ్యాలపై విస్తృతంగా పెట్టుబడి పెట్టడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అదనంగా 8.3 ట్రిలియన్ డాలర్ల లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగం ఆన్‌లైన్‌లో కొనసాగుతుంది. దీంతో టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది.

‘ప్రస్తుత డిజిటల్ యుగంలో ఉద్యోగులకు డిజిటల్ స్కిల్స్ అవసరమన్న విషయాన్ని అన్ని సంస్థలు గ్రహించాయి. కొత్త ఉద్యోగులు తప్పనిసరిగా మల్టిపుల్ స్కిల్స్‌తో పాటు హార్డ్, సాఫ్ట్‌వేర్ సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. ఇంటర్వ్యూ సమయంలో ఉద్యోగంతో సంబంధం లేకుండా రిక్రూటర్లు కొత్త నియామకాల కోసం అభ్యర్థుల నుంచి విస్తృత నైపుణ్యం, మరింత ఎక్స్‌పీరియన్స్‌ కోరుకుంటున్నారు’. అని డిజిటల్ స్కిల్స్ ఇన్‌స్టిట్యూట్ అభిప్రాయపడింది.

జెట్‌కింగ్ ఇన్ఫోట్రెయిన్ ఎండీ హర్ష్ భర్వానీ మాట్లాడుతూ.. ‘‘కరోనా కారణంగా మునుపెన్నడూ లేని విధంగా డిజిటల్ రంగంలో విస్తృతంగా మార్పులు చోటుచేసుకున్నాయి. జెట్‌కింగ్‌ ద్వారా పరిశ్రమ రంగంలో విజయం సాధించడానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలతో తదుపరి తరాన్ని సన్నద్ధం చేయాలనుకుంటున్నాం. నేటి సాంకేతిక ప్రపంచంలోని వివిధ మార్గాలను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న విద్యార్థుల కోసం ఉచిత డిజిటల్ స్కిల్స్ ప్లాట్‌ఫారమ్‌ను అందించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని తెలిపారు.

ఇది కూడా చదవండి : జేఈఈకి ప్రిపేర్ అవుతున్నారా.. ఈ 4 టిప్స్ పాటిస్తే బెస్ట్ రిజల్ట్స్.. అవేంటంటే?

మరోవైపు, ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ సింప్లి‌లెర్న్ (Simplilearn) ‘జాబ్ గ్యారెంటీ ప్రోగ్రామ్స్ ఇండెక్స్’లో భాగంగా డిజిటల్ మార్కెటింగ్‌లో ఆన్‌లైన్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కోర్సు ఆరు నెలల పాటు జరగనుంది. డిజిటల్ మార్కెటింగ్‌లో లెర్నర్స్‌కు స్కిల్స్ పెంచడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యమని సింప్లి‌లెర్న్ తెలిపింది.

ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత మాస్టర్స్ సర్టిఫికేట్ ప్రదానం చేయనున్నారు. ప్రొఫైల్ క్రియేట్, మాక్ ఇంటర్వ్యూలపై కూడా అభ్యర్థులకు అవగాహన కల్పించనున్నారు. అలాగే గ్రాడ్యుయేషన్ తర్వాత 180 రోజులలోపు జాబ్ గ్యారెంటీ కూడా ఇవ్వనున్నారు. ఇంకా, రెజ్యూమ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Digital, Digital marketing, EDUCATION, JOBS, Training

ఉత్తమ కథలు