Jobs: ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతతో 220 ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు

National Seeds Corporation Recruitment 2020 | ఇంటర్, డిగ్రీ, పీజీ పాసయ్యారా? నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తు గడువును పొడిగించింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: August 5, 2020, 5:02 PM IST
Jobs: ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతతో 220 ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు
Jobs: ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతతో 220 ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 220 పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ పోస్టులకు అప్లికేషన్ డెడ్‌లైన్ ఆగస్ట్ 4న ముగిసింది. అయితే దరఖాస్తు గడువును పొడిగించాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో అప్లికేషన్ డెడ్‌లైన్‌ను ఆగస్ట్ 19 వరకు పొడిగించింది నేషనల్ సీడ్స్ కార్పొరేషన్. అభ్యర్థులకు మరో 2 వారాలు అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతతో అసిస్టెంట్ (లీగల్), మేనేజ్‌మెంట్ ట్రైనీ, సీనియర్ ట్రైనీ, డిప్లొమా ట్రైనీ, ట్రైనీ మేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం https://www.indiaseeds.com/ వెబ్‌సైట్‌ చూడండి.

National Seeds Corporation Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 220
అసిస్టెంట్ గ్రేడ్ 1- 03
మేనేజ్‌మెంట్ ట్రైనీ (ప్రొడక్షన్)-16
మేనేజ్‌మెంట్ ట్రైనీ (హార్టికల్చర్)- 01
మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్)- 07మేనేజ్‌మెంట్ ట్రైనీ (హ్యూమన్ రిసోర్స్)- 02
మేనేజ్‌మెంట్ ట్రైనీ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్)- 04
మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్ ఇంజనీరింగ్)- 01
మేనేజ్‌మెంట్ ట్రైనీ (క్వాలిటీ కంట్రోల్)- 02
మేనేజ్‌మెంట్ ట్రైనీ (మెటీరియల్స్ మేనేజ్‌మెంట్)- 03
సీనియర్ ట్రైనీ (అగ్రికల్చర్)- 29
సీనియర్ ట్రైనీ (అగ్రికల్చర్) ప్లాంట్ ప్రొటెక్షన్- 03
సీనియర్ ట్రైనీ (హార్టికల్చర్)- 01
సీనియర్ ట్రైనీ (మార్కెటింగ్)- 10
సీనియర్ ట్రైనీ (హ్యూమన్ రిసోర్స్)- 05
సీనియర్ ట్రైనీ (లాజిస్టిక్స్)- 05
సీనియర్ ట్రైనీ (క్వాలిటీ కంట్రోల్)- 01
సీనియర్ ట్రైనీ (అకౌంట్స్)- 05
డిప్లొమా ట్రైనీ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్)- 04
డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)- 03
ట్రైనీ (అగ్రికల్చర్)- 18
ట్రైనీ (మార్కెటింగ్)- 17
ట్రైనీ (హ్యూమన్ రిసోర్స్)- 08
ట్రైనీ (అగ్రి స్టోర్స్)- 06
ట్రైనీ (పర్చేస్)- 02
ట్రైనీ (టెక్నీషియన్)- 27
ట్రైనీ (స్టోర్స్ ఇంజనీరింగ్)- 09
ట్రైనీ (స్టెనోగ్రాఫర్)- 13
ట్రైనీ (క్వాలిటీ కంట్రోల్)- 03
ట్రైనీ (డీఈఓ)- 03
ట్రైనీ (అకౌంట్స్)- 06
ట్రైనీ మేట్ (అగ్రికల్చర్)- 03

National Seeds Corporation Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 14
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 19
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.
Published by: Santhosh Kumar S
First published: August 5, 2020, 5:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading