Home /News /jobs /

NATIONAL SCHOLARSHIP SCHEME BEST CHANCE FOR 12TH PASSED STUDENTS KNOW DETAILS EVK

Scholarships: ఇంట‌ర్ పాస్ అయ్యారా.. స్కాలర్‌షిప్‌కు ఇలా అప్లై చేయండి

నేష‌న‌ల్ స్కాల‌ర్‌షిప్‌

నేష‌న‌ల్ స్కాల‌ర్‌షిప్‌

జాతీయ స్కాలర్‌షిప్‌ స్కీమ్-202 (National Scholarship Scheme -2021) కోసం కేంద్ర విద్యా శాఖ. దరఖాస్తుల‌ను స్వీక‌రిస్తోంది. 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు (Scholarship) అప్లై చేసుకోవచ్చు. ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 30, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...
    జాతీయ స్కాలర్‌షిప్‌ స్కీమ్-202 (National Scholarship Scheme -2021) కోసం కేంద్ర విద్యా శాఖ. దరఖాస్తుల‌ను స్వీక‌రిస్తోంది. 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు (Scholarship) అప్లై చేసుకోవచ్చు. 2018లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా కుటుంబ ఆదాయం రూ.6 లక్షల కంటే తక్కువ ఉండి, ప్రతిభ కలిగిన విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం  అందిస్తారు. ఈ స్కాలర్‌షిప్‌కు  ఎంపికైన విద్యార్థులకు మొదటి మూడు సంవత్సరాలు ఏడాదికి రూ.10 వేలు చొప్పున.. నాలుగు, ఐదు సంవత్సరాలకు ఏడాదికి రూ.20,000 చొప్పున అందిస్తారు. మొత్తం మీద గ్రాడ్యుయేషన్ (Graduation), పీజీ పూర్తయ్యే లోపు రూ.70 వేల వరకు ఉపకార వేతనం పొందుతారు.

    ఏటా ఈ పథకం ద్వారా 82,000 స్కాలర్‌షిప్‌లను ఇస్తున్నారు. 41,000 మంది బాలురు, అంతే మొత్తంలో బాలికలకు  అందజేస్తున్నారు. 12వ తరగతి బోర్డు పరీక్షల్లో 80 శాతానికి పైగా మార్కులు సాధించిన వారు అర్హులు. ఈ పథకానికి అర్హత సాధించాలంటే రెగ్యులర్ కోర్సులు (Regular Course) మాత్రమే అభ్యసిస్తూ ఉండాలి. ఇతర స్కాలర్‌షిప్‌ ప్రయోజనాలు పొందకూడదు. ఈ ఉపకారవేతనం నేరుగా బెనిఫిషియరీ బ్యాంకు అకౌంట్లలోనే జమ చేస్తారు.

    Online Course: ఇంటి నుంచే చ‌దివేయండి.. టాప్ ఫ్రీ ఆన్‌లైన్ కోర్సుల వివ‌రాలు


    ద‌ర‌ఖాస్తుకు అర్హ‌త‌లు

    -  డిప్లొమా కోర్సులు చదువుతున్నవారు ఈ పథకానికి అర్హులు కారు.

    - కరస్పాండెన్స్ లేదా దూర విద్య ద్వారా చదువుతున్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేయకూడదు.

    -  విద్యార్థులు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యూజీసీ యాక్ట్- 1956, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా డెంటల్ కౌన్సిల్ ఇండియా గుర్తించిన కళాశాలలు లేదా విద్యాసంస్థల్లో రెగ్యులర్ కోర్సులు అభ్యసిస్తూ ఉండాలి.

    -  ఇప్పటికే ఏవైనా స్కాలర్‌షిప్‌లు పొందుతున్నా లేదా రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రియంబర్స్ మెంట్ పొందుతున్నవారు ఈ స్కీమ్‌కు అనర్హులు.

    -  ఈ ఆన్‌లైన్ అప్లికేషన్లను రెండు దశల్లో తనిఖీ చేస్తారు. విద్యార్థులు చదువుతున్న విద్యా సంస్థ, దరఖాస్తుదారుని స్టేట్ బోర్డు వివరాలను పరిశీలిస్తారు.

    IBPS Exams: ఐబీపీఎస్ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవుతున్నారా..? అయితే టిప్స్ పాటించండి


    - కళాశాల లేదా సంబంధిత స్టేట్ బోర్డు ధ్రువీకరించని అప్లికేషన్ చెల్లుబాటు కాదు.

    -  సంవత్సరానికి ఓ సారి ఈ పథకం కింద వర్తించే స్కాలర్‌షిప్‌ను పునరుద్ధరిస్తారు. గ్రాడ్యుయేట్ నుంచి పీజీ కోర్సు వరకు ఈ పునరుద్ధరణ అందుబాటులో ఉంటుంది.

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 :  పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

    Step 2 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్ scholarship.gov.in ను సంద‌ర్శించాలి.

    Step 3 :  అనంత‌రం https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction వెబ్‌సైట్ లింక్‌లో విధివిధానాలు చ‌ద‌వాలి.

    Step 4 :  అనంత‌రం అప్లికేష‌న్ కోసం continue బ‌ట‌న్ నొక్కాలి.

    Step 5 :  త‌రువాత Fresh Registration For Academic Year 2021-22 ఫాం వ‌స్తుంది.

    Step 6 :  ద‌ర‌ఖాస్తు పూర్తిగా నింపి స‌బ్‌మిట్ చేయాలి.

    Step 7 :  ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 30, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: EDUCATION, Intermediate, Scholarship, Students

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు