హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

National Scholarship: వారం రోజులే గ‌డువు.. రూ.70వేల స్కాల‌ర్‌షిప్‌ పొందేందుకు అప్లై చేసుకోండి

National Scholarship: వారం రోజులే గ‌డువు.. రూ.70వేల స్కాల‌ర్‌షిప్‌ పొందేందుకు అప్లై చేసుకోండి

నేష‌న‌ల్ స్కాల‌ర్‌షిప్ 2021-22

నేష‌న‌ల్ స్కాల‌ర్‌షిప్ 2021-22

National Scholar Ship 2021: ఇంట‌ర్ పూర్త‌యిన విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం అందించే ముఖ్య‌మైన స్కాల‌ర్‌షిప్ జాతీయ స్కాలర్‌షిప్‌ స్కీమ్, ఈ ఏడాది ఈ స్కాల‌ర్‌షిప్ అప్లే చేసుకోవ‌డానికి న‌వంబ‌ర్ 30, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ఈ స్కాల‌ర్‌షిప్‌కు అర్హ‌త సాధించిన వారికి సుమారు రూ.70,000 వ‌ర‌కు ప్ర‌భుత్వం ఉప‌కార వేత‌నం అందిస్తుంది.

ఇంకా చదవండి ...

జాతీయ స్కాలర్‌షిప్‌ స్కీమ్-2021 (National Scholarship Scheme -2021) కోసం కేంద్ర విద్యా శాఖ. దరఖాస్తుల‌ను స్వీక‌రిస్తోంది. 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు (Scholarship) అప్లై చేసుకోవచ్చు. 2018లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా కుటుంబ ఆదాయం రూ.6 లక్షల కంటే తక్కువ ఉండి, ప్రతిభ కలిగిన విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం  అందిస్తారు. ఈ స్కాలర్‌షిప్‌కు  ఎంపికైన విద్యార్థులకు మొదటి మూడు సంవత్సరాలు ఏడాదికి రూ.10 వేలు చొప్పున.. నాలుగు, ఐదు సంవత్సరాలకు ఏడాదికి రూ.20,000 చొప్పున అందిస్తారు. మొత్తం మీద గ్రాడ్యుయేషన్ (Graduation), పీజీ పూర్తయ్యే లోపు రూ.70 వేల వరకు ఉపకార వేతనం పొందుతారు.

ఏటా ఈ పథకం ద్వారా 82,000 స్కాలర్‌షిప్‌లను ఇస్తున్నారు. 41,000 మంది బాలురు, అంతే మొత్తంలో బాలికలకు  అందజేస్తున్నారు. 12వ తరగతి బోర్డు పరీక్షల్లో 80 శాతానికి పైగా మార్కులు సాధించిన వారు అర్హులు. ఈ పథకానికి అర్హత సాధించాలంటే రెగ్యులర్ కోర్సులు (Regular Course) మాత్రమే అభ్యసిస్తూ ఉండాలి. ఇతర స్కాలర్‌షిప్‌ ప్రయోజనాలు పొందకూడదు. ఈ ఉపకారవేతనం నేరుగా బెనిఫిషియరీ బ్యాంకు అకౌంట్లలోనే జమ చేస్తారు.

DCCB Recruitment 2021: నెల్లూరు డీసీసీబీలో ఉద్యోగాలు.. జీతం రూ. 33,000


ద‌ర‌ఖాస్తుకు అర్హ‌త‌లు

-  డిప్లొమా కోర్సులు (Diploma Course) చదువుతున్నవారు ఈ పథకానికి అర్హులు కారు.

- కరస్పాండెన్స్ లేదా దూర విద్య ద్వారా చదువుతున్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేయకూడదు.

-  విద్యార్థులు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యూజీసీ యాక్ట్- 1956, మెడికల్ కౌన్సిల్ (Medical Council) ఆఫ్ ఇండియా లేదా డెంటల్ కౌన్సిల్ ఇండియా గుర్తించిన కళాశాలలు లేదా విద్యాసంస్థల్లో రెగ్యులర్ కోర్సులు అభ్యసిస్తూ ఉండాలి.

-  ఇప్పటికే ఏవైనా స్కాలర్‌షిప్‌లు పొందుతున్నా లేదా రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రియంబర్స్ మెంట్ పొందుతున్నవారు ఈ స్కీమ్‌కు అనర్హులు.

-  ఈ ఆన్‌లైన్ అప్లికేషన్లను రెండు దశల్లో తనిఖీ చేస్తారు. విద్యార్థులు చదువుతున్న విద్యా సంస్థ, దరఖాస్తుదారుని స్టేట్ బోర్డు వివరాలను పరిశీలిస్తారు.

Jobs In Telangana: మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌లో 275 ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్‌ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు


- కళాశాల లేదా సంబంధిత స్టేట్ బోర్డు ధ్రువీకరించని అప్లికేషన్ చెల్లుబాటు కాదు.

-  సంవత్సరానికి ఓ సారి ఈ పథకం కింద వర్తించే స్కాలర్‌షిప్‌ను పునరుద్ధరిస్తారు. గ్రాడ్యుయేట్ నుంచి పీజీ కోర్సు వరకు ఈ పునరుద్ధరణ అందుబాటులో ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 :  పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

Step 2 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్ scholarship.gov.in ను సంద‌ర్శించాలి.

Step 3 :  అనంత‌రం https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction వెబ్‌సైట్ లింక్‌లో విధివిధానాలు చ‌ద‌వాలి.

Step 4 :  అనంత‌రం అప్లికేష‌న్ కోసం continue బ‌ట‌న్ నొక్కాలి.

Step 5 :  త‌రువాత Fresh Registration For Academic Year 2021-22 ఫాం వ‌స్తుంది.

Step 6 :  ద‌ర‌ఖాస్తు పూర్తిగా నింపి స‌బ్‌మిట్ చేయాలి.

Step 7 :  ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 30, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

First published:

Tags: EDUCATION, Scholarships, Students, Under graduation

ఉత్తమ కథలు