Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1502 జాబ్స్... రేపే లాస్ట్ డేట్

NRRMS Andhra Pradesh Recruitment 2020 | ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్, డిగ్రీ పాసైనవారికి 1502 ఉద్యోగాల భర్తీకి నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ-NRRMS నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: March 4, 2020, 1:16 PM IST
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1502 జాబ్స్... రేపే లాస్ట్ డేట్
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1502 జాబ్స్... రేపే లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ-NRRMS ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్-DDU-RID ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం 1502 ఖాళీలను భర్తీ చేస్తోంది. కంప్యూటర్ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, డేటా మేనేజర్, మల్టీ టాస్కింగ్ అఫీషియల్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://nrrmsvacancy.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు https://www.nrrmsvacancy.com/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

NRRMS Andhra Pradesh Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 1502

కంప్యూటర్ ఆపరేటర్- 288
టెక్నికల్ అసిస్టెంట్- 31
డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్- 9


అకౌంట్స్ ఆఫీసర్- 13డేటా మేనేజర్- 83
ఎంఐఎస్ మేనేజర్- 137
ఎంఐఎస్ అసిస్టెంట్- 226
మల్టీ టాస్కింగ్ అఫీషియల్- 223
ఫీల్డ్ కోఆర్డినేటర్- 254
ఫెసిలిటేటర్స్- 248

Andhra Pradesh Jobs, NRRMS Andhra Pradesh Recruitment 2020, National Rural Recreation Mission Society jobs, NRRMS jobs in Andhra Pradesh, AP Jobs, Andhra Pradesh news, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ వార్తలు, నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ ఉద్యోగాలు, ఏపీ న్యూస్
ప్రతీకాత్మక చిత్రం

NRRMS Andhra Pradesh Recruitment 2020: వేతనాల వివరాలివే...


కంప్యూటర్ ఆపరేటర్- రూ.16700
టెక్నికల్ అసిస్టెంట్- రూ.19650
డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్- రూ.26560
అకౌంట్స్ ఆఫీసర్- రూ.22650
డేటా మేనేజర్- రూ.17630
ఎంఐఎస్ మేనేజర్- రూ.17660
ఎంఐఎస్ అసిస్టెంట్- రూ.17030
మల్టీ టాస్కింగ్ అఫీషియల్- రూ.16300
ఫీల్డ్ కోఆర్డినేటర్- రూ.16660
ఫెసిలిటేటర్స్- రూ.16660

Andhra Pradesh Jobs, NRRMS Andhra Pradesh Recruitment 2020, National Rural Recreation Mission Society jobs, NRRMS jobs in Andhra Pradesh, AP Jobs, Andhra Pradesh news, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ వార్తలు, నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ ఉద్యోగాలు, ఏపీ న్యూస్
ప్రతీకాత్మక చిత్రం

NRRMS Andhra Pradesh Recruitment 2020: విద్యార్హతలు ఇవే...


కంప్యూటర్ ఆపరేటర్- ఇంటర్‌తో పాటు కనీరం 6 నెలల డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ సర్టిఫికెట్ ఉండాలి.
టెక్నికల్ అసిస్టెంట్- డిగ్రీ లేదా 6 నెలల డీసీఏ, కంప్యూటర్ టైపింగ్‌, డేటా ఎంట్రీ, రిపోర్ట్ జనరేషన్‌లో నైపుణ్యం, ఎంఎస్ ఆఫీస్‌లో ఏడాదికి పైగా అనుభవం ఉండాలి. (బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ-IT, బీఎస్సీ-IT, బీసీఏ, పీజీడీసీఏ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది)
డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్- సోషల్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సెక్టార్‌లో ఏడాది అనుభవంతో పీజీ, మూడేళ్ల అనుభవంతో డిగ్రీ ఉండాలి.
అకౌంట్స్ ఆఫీసర్- ఫైనాన్స్, అకౌంట్స్ సంబంధిత అంశాల్లో 2 ఏళ్ల అనుభవంతో డిగ్రీ లేదా పీజీ ఉండాలి.
డేటా మేనేజర్- డిగ్రీతోపాటు కంప్యూటర్ టైపింగ్‌, డేటా ఎంట్రీ, రిపోర్ట్ జనరేషన్‌లో నైపుణ్యం, ఎంఎస్ ఆఫీస్‌లో ఏడాదికి పైగా అనుభవం ఉండాలి. (బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ-IT, బీఎస్సీ-IT, బీసీఏ, పీజీడీసీఏ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది)
ఎంఐఎస్ మేనేజర్- రిపోర్ట్ జనరేషన్‌లో 2 ఏళ్లకు పైగా అనుభవంతో డిగ్రీ, 4 ఏళ్లకు పైగా అనుభవంతో డిప్లొమా ఉండాలి. (బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ-IT, బీఎస్సీ-IT, బీసీఏ, పీజీడీసీఏ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది)
ఎంఐఎస్ అసిస్టెంట్- కంప్యూటర్ అప్లికేషన్స్‌లో 2 ఏళ్లకు పైగా అనుభవంతో డిప్లొమా లేదా డిగ్రీ. (బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ-IT, బీఎస్సీ-IT, బీసీఏ, పీజీడీసీఏ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది)
మల్టీ టాస్కింగ్ అఫీషియల్- కంప్యూటర్ అప్లికేషన్స్‌లో 2 ఏళ్లకు పైగా అనుభవంతో 10+2 లేదా డిగ్రీ ఉండాలి.
ఫీల్డ్ కోఆర్డినేటర్- కంప్యూటర్ అప్లికేషన్స్‌లో అనుభవంతో పాటు 10+2 ఉండాలి.
ఫెసిలిటేటర్స్- కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ఏడాదికి పైగా అనుభవంతో 10+2 పాస్ కావాలి.

Andhra Pradesh Jobs, NRRMS Andhra Pradesh Recruitment 2020, National Rural Recreation Mission Society jobs, NRRMS jobs in Andhra Pradesh, AP Jobs, Andhra Pradesh news, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ వార్తలు, నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ ఉద్యోగాలు, ఏపీ న్యూస్
ప్రతీకాత్మక చిత్రం

NRRMS Andhra Pradesh Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


నోటిఫికేషన్ విడుదల- 2020 ఫిబ్రవరి 10
దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 13
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 5
వయస్సు- 18 నుంచి 43 ఏళ్లు. (పోస్టును బట్టి వయస్సు మారుతుంది)
ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.250. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

DRDO Jobs: డీఆర్‌డీఓలో 116 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

Railway Jobs: రైల్వే సంస్థలో 182 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

ISRO Jobs: ఇస్రోలో 183 జాబ్స్... మార్చి 6 లాస్ట్ డేట్
First published: March 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు