Home /News /jobs /

NATIONAL RECRUITMENT AGENCY NRA TO CONDUCT COMMON ELIGIBILITY TEST CET IN SEPTEMBER FOR ALL CENTRAL GOVERNMENT JOBS INCLUDING RAILWAY AND PSU BANK JOBS SS

Common Eligibility Test: రైల్వే జాబ్ సహా అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష... ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే

Common Eligibility Test: రైల్వే జాబ్ సహా అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష... ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

Common Eligibility Test: రైల్వే జాబ్ సహా అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష... ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

Common Eligibility Test | రైల్వేలో ఉద్యోగం మీ కలా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకుంటున్నారా? ప్రభుత్వ బ్యాంకులో జాబ్ పొందాలనుకుంటున్నారా? ఈ ఉద్యోగాలన్నింటికీ త్వరలో ఒకే ఎగ్జామ్ జరగనుంది.

  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు వేర్వేరుగా పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. ఒకే పరీక్ష రాస్తే చాలు. అంటే వేర్వేరు పరీక్షలకు ఫీజు వేర్వేరుగా చెల్లించి, ఎగ్జామ్స్ ఒక్కొక్కటిగా రాయాల్సిన పరిస్థితి ఉండదు. త్వరలోనే ఈ ఉద్యోగాలన్నింటికీ ఒకే పరీక్ష ఉండబోతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ-NRA ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ఈ ఏడాది సెప్టెంబర్‌లో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET నిర్వహించనుంది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వంలో వేర్వేరు సంస్థల్లో ఉద్యోగాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. రైల్వేలో ఖాళీల భర్తీ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. అభ్యర్థులు ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసి పరీక్షలకు హాజరవుతున్నారు.

  Jobs with Degree: రూ.65,000 వేతనంతో జాబ్స్... డిగ్రీ పాస్ అర్హత... దరఖాస్తుకు 3 రోజులే గడువు

  GATE 2021: 67 ఏళ్ల వయసులో GATE పరీక్షల్లో పాస్... నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే

  కానీ ఇకపై ఈ పరిస్థితి ఉండదు. ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్, ఎస్ఎస్‌సీ నిర్వహించే నియామకాలకు ఒకే దరఖాస్తు చేస్తే చాలు. పరీక్ష కూడా ఒకటే ఉంటుంది. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ-NRA నిర్వహిస్తుంది. అంటే ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్, ఎస్ఎస్‌సీ నిర్వహించే ఎగ్జామ్స్ ఇకపై ఉండవు. నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ-NRA నిర్వహించే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET మాత్రమే ఉంటుంది. నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలో భారతీయ రైల్వే, ఆర్థిక శాఖ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్ ప్రతినిధులు ఉంటారు. అన్ని సంస్థలకు కలిపి కామన్‌గా ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తారు. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఆ ప్రశ్నాపత్రమే ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగ సంస్థలో నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీ కోసం మాత్రమే నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ సెట్ నిర్వహిస్తుంది. అది కూడా ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్, ఎస్ఎస్‌సీ నియామకాల కోసం ఇది మొదటి దశ పరీక్ష మాత్రమే. మొదటి దశ క్వాలిఫై అయినవారికి ఆయా సంస్థలు వేర్వేరుగా ఇతర దశల పరీక్షల్ని, ఇంటర్వ్యూలను నిర్వహిస్తాయి.

  Grow With Mi: 10,000 ఉద్యోగాలు... రూ.100 కోట్ల ప్యాకేజీ... ఇండియాలో షావోమీ ప్లాన్స్

  Jobs in Kia Motors: కియా మోటార్స్‌లో ఉద్యోగాలు... విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు

  నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ-NRA దేశవ్యాప్తంగా 1000 కేంద్రాల్లో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET నిర్వహిస్తుంది. అభ్యర్థులు కామన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయాలి. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తమకు సమీపంలో ఉన్న ఎగ్జామ్ సెంటర్ ఎంచుకోవచ్చు. ఎగ్జామ్ ఆన్‌లైన్‌లో ఉంటుంది. అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయాలి. ప్రతీ ఏటా రెండుసార్లు ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్ పాస్ అయినవారికి, డిగ్రీ పాస్ అయినవారికి సెట్ సిలబస్ వేర్వేరుగా ఉంటుంది. అభ్యర్థులు ఈ రెండు పరీక్షల్ని రాయొచ్చు. ఇంగ్లీష్‌, హిందీతో పాటు 12 భారతీయ భాషల్లో పరీక్ష రాయొచ్చు. అంటే తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తెలుగులోనే పరీక్ష రాయొచ్చు. ఇందుకోసం ప్రశ్నాపత్రాన్ని ట్రాన్స్‌లేట్ చేసేందుకు లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్స్‌ని నియమించుకోనుంది NRA. సెట్‌లో సాధించిన స్కోర్‌కు మూడేళ్ల వేలిడిటీ ఉంటుంది. ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా పరీక్ష రాయొచ్చు. ఈ స్కోర్ ద్వారా ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్, ఎస్ఎస్‌సీ ఉద్యోగాల భర్తీకి రెండో దశ పరీక్ష కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Bank Jobs 2021, CAREER, Central Government, Exams, Govt Jobs 2021, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు