రైల్వే జాబ్ నిరుద్యోగుల కల. మీరు కూడా రైల్వేలో ఉద్యోగాలు కోరుకుంటున్నారా? రైల్వేలో ఉద్యోగావకాశాలను పెంచేందుకు కొన్ని కోర్సులు చేయొచ్చు. నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూట్-NRTI ఇలాంటి కోర్సుల్నే అందిస్తోంది. 2020-21 విద్యా సంవత్సరానికి 10 కోర్సుల్ని ప్రకటించింది. అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్ఆర్‌టీఐ అందిస్తున్న 10 కోర్సుల్లో 8 కొత్తవి కావడం విశేషం. వీటిలో కొన్ని కోర్సుల్ని ఎన్ఆర్‌టీఐ ఎక్స్‌క్లూజీవ్‌గా అందిస్తోంది. బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌తో కలిసి మాస్టర్స్ ఇన్ రైల్వే సిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ ఇంటిగ్రేషన్ కోర్సును కూడా అందిస్తోంది. బీబీఏ, బీఎస్‌సీ కోర్సులకు దరఖాస్తు చేయడానికి జూలై 31 చివరి తేదీ. ఆగస్ట్ 23న ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది. బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 14 లాస్ట్ డేట్. జేఈఈ మెయిన్స్ స్కోర్ ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి. ఈ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలను విద్యార్థులు https://www.nrti.edu.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
DRDO Jobs: గుడ్ న్యూస్... డీఆర్‌డీఓలో 311 ఉద్యోగాలకు గడువు పెంపు
Police Jobs: మొత్తం 1564 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... సిలబస్ ఇదే
బీబీఏ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజ్‌మెంట్- 3 ఏళ్లు
బీఎస్‌సీ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ- 3 ఏళ్లు
బీటెక్ ఇన్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్- 4 ఏళ్లు
బీటెక్ ఇన్ రైల్ సిస్టమ్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 4 ఏళ్లు
ఎంబీఏ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజ్‌మెంట్
ఎంబీఏ ఇన్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్
ఎంఎస్సీ ఇన్ ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీ అండ్ పాలసీ
ఎంఎస్సీ ఇన్ ట్రాన్స్‌పోర్ట్ ఎకనమిక్స్
ఎంఎస్సీ ఇన్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ అనలిటిక్స్
ఎంఎస్ ఇన్ రైల్వే సిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ ఇంటిగ్రేషన్ (యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌తో కలిసి ఇంటర్నేషనల్ డిగ్రీ ప్రోగ్రామ్)
ఈ కోర్సులన్నీ ఆన్‌లైన్‌లోనే అందిస్తోంది నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూట్-NRTI. విద్యార్థులకు డిజిటల్ సర్టిఫికెట్లు ఇస్తుంది. ఇవే కాకుండా విద్యార్థులు ప్రముఖ యూనివర్సిటీల నుంచి 4,000 ఆన్‌లైన్ కోర్సుల్ని ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, EDUCATION, Exams, Indian Railway, Indian Railways, NOTIFICATION, Online Education, Railway Apprenticeship, Railways