హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Scholarships: విదేశాల్లో చదవాలనుకుంటున్న వారికి స్పెషల్ స్కాలర్‌షిప్.. జులై 30లోపు దరఖాస్తు చేసుకునే ఛాన్స్.. పూర్తి వివరాలివే

Scholarships: విదేశాల్లో చదవాలనుకుంటున్న వారికి స్పెషల్ స్కాలర్‌షిప్.. జులై 30లోపు దరఖాస్తు చేసుకునే ఛాన్స్.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎస్టీ విద్యార్థులకు అలర్ట్.. ప్రస్తుతం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry Of Tribal Affairs) షెడ్యూల్డ్ తెగ (ST) అభ్యర్థుల నుంచి నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్కీమ్ (National Overseas Scholarship Scheme) కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఇంకా చదవండి ...

ఎస్టీ విద్యార్థులకు (Students) అలర్ట్.. ప్రస్తుతం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry Of Tribal Affairs) షెడ్యూల్డ్ తెగ (ST) అభ్యర్థుల నుంచి నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్కీమ్ (National Overseas Scholarship Scheme) కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2022-23 విద్యా సంవత్సరానికి స్కాలర్‌షిప్ (Scholarship) పొందాలనుకునే విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మాస్టర్స్, పీహెచ్‌డీ, పోస్ట్-డాక్టోరల్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లలో విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకుంటున్న సెలెక్టెడ్ స్టూడెంట్స్‌కు ప్రభుత్వం ఎన్ఓఎస్ (NOS) స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది. ఎన్ఓఎస్ స్కాలర్‌షిప్ పొందాలనుకునే విద్యార్థులు జూలై 30, 2022లోపు నేషనల్ ఓవర్సీస్ పోర్టల్ overseas.tribal.gov.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

స్కీమ్ మార్గదర్శకాలు రివిజన్‌లో ఉన్నాయని, మార్పులు అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో తెలియజేస్తామని తాజాగా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, “ప్రతి ఏటా 20 మంది ఫ్రెష్ ఎస్టీ విద్యార్థులకు విదేశాలలో మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ, పోస్ట్-డాక్టోరల్ కోర్సులను అభ్యసించడానికి స్కాలర్‌షిప్‌లు అందించడం జరుగుతుంది. పోర్టల్ డిజిటల్ లాకర్‌తో అనుసంధానమై ఉంటుంది. పోర్టల్ డిజిటల్ లాకర్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లను ఈజీగా యాక్సెస్ చేస్తుంది. పోర్టల్‌లో డిజిలాకర్‌లో అందుబాటులో లేని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసే సౌకర్యం కూడా ఉంది."

Scholarships: ఉన్న‌త విద్య‌లో స్కాల‌ర్‌షిప్ కోసం ట్రై చేస్తున్నారా.. అయితే వీటి గురించి తెలుసుకోండి

“ఏ విభాగంలోనైనా సరే బ్యాచిలర్ స్థాయి కోర్సులు ఎన్ఓఎస్ పథకం పరిధిలోకి రావు. ఎస్టీ విద్యార్థులకు ఏడాదికి 20 అవార్డులు మంజూరు చేస్తారు. షెడ్యూల్డ్ తెగల స్టూడెంట్స్‌కు 17 అవార్డులు... మరింత వెనుకబడ్డ గిరిజన సమూహాలకు (PTG) 3 అవార్డులు ఆఫర్ చేస్తారు." అని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే విదేశాల్లోని యూనివర్సిటీల నుంచి ప్రిలిమినరీ లెటర్/అడ్మిషన్ ఆఫర్ పొందిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జీఆర్ఈ/ జీమ్యాట్/టోఫెల్ (GRE/GMAT/TOFEL) మొదలైన వాటిని క్లియర్ చేసి, వివిధ యూనివర్సిటీలకు దరఖాస్తు చేయడం ప్రారంభించిన అభ్యర్థులకు రెండవ ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత ఇతర అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది.

Startup Competition: స్టార్టప్‌లకు బంపర్ ఆఫర్.. 1,50,000 డాలర్లు గెలుచుకునే అవకాశం!

ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఎకనామిక్/ఫైనాన్స్, ప్యూర్ సైన్స్, అప్లైడ్ సైన్స్, అగ్రికల్చర్, మెడిసిన్, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్ సబ్జెక్టులు ఈ స్కీమ్ పరిధిలోకి వస్తాయి. ఏదైనా నిర్దిష్ట సంవత్సరానికి, పైన చెప్పిన సబ్జెక్టుల ప్రకారం అభ్యర్థులు అందుబాటులో లేకుంటే, ఆ సంవత్సరపు అవార్డులు పై వర్గాల మధ్య షేర్ చేయడం జరుగుతుంది. బాలికలకు ఆరు అవార్డులు (30%) లేదా స్కాలర్‌షిప్‌లు కేటాయిస్తారు. అయితే, అమ్మాయిలకు కేటాయించిన స్లాట్‌లు ఫిల్ అవ్వని పక్షంలో, ఈ స్లాట్‌లను అబ్బాయిలకు బదిలీ చేయవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌కు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సరిపడా ఆర్థిక సహాయం అందజేస్తుంది ప్రభుత్వం. ఆసక్తి గల అభ్యర్థులు ఇప్పటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Career and Courses, Higher education, JOBS

ఉత్తమ కథలు