Home /News /jobs /

NATIONAL MEDICAL COMMISSION LIKELY TO VISIT TELANGAN FOR 8 MEDICAL COLLEGES IN DECEMBER EVK

Telangana : కొత్త మెడిక‌ల్ క‌ళాశాల‌ను సంద‌ర్శించ‌నున్న ఎన్ఎమ్‌సీ.. వివ‌రాలు ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

తెలంగాణ ప్ర‌భుత్వం 8 మెడిక్ కాలేజీ (Medical College) ఏర్పాటుకు అనుమ‌తి కోరుతూ మెడిక‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Medical Council of India) ద‌ర‌ఖాస్తు చేసుకొన్న విష‌యం తెలిసింది. ఒక్కో కాలేజీ 150 మెడిక‌ల్ సీట్ల సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉంటున్న‌ట్టు పేర్కొంది. ఈ నేప‌థ్యంలో ఎనిమిది క‌ళాశాల‌ల‌ను ప‌రిశీలించేందుకు నేష‌న‌ల్ మెడిక‌ల్ క‌మిష‌న్ స‌ద‌ర్శించ‌నుంది.

ఇంకా చదవండి ...
    తెలంగాణ ప్ర‌భుత్వం 8 మెడిక్ కాలేజీ (Medical College) ఏర్పాటుకు అనుమ‌తి కోరుతూ మెడిక‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Medical Council of India) ద‌ర‌ఖాస్తు చేసుకొన్న విష‌యం తెలిసింది. ఒక్కో కాలేజీ 150 మెడిక‌ల్ సీట్ల సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉంటున్న‌ట్టు పేర్కొంది. ఈ ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌లో భాగంగా నేష‌న‌ల్ మెడికల్ క‌మిష‌న్ (National Medical Commission) ఈ వైద్య కళాశాల‌ల‌ను సంద‌ర్శించేదుకు డిసెంబ‌ర్‌లో వ‌స్తున్న‌ట్లు పేర్కొంది. తెలంగాణ (Telangana) ప్ర‌భుత్వం రామగుండం (Ramagundam), వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం (Kothagudem), జ‌గిత్యాల‌, మంచిర్యాల‌, సంగారెడ్డిల‌లో కొత్త ఎనిమిది మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకొంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే బృందం క‌ళాశాల ఏర్పాటు వ‌స‌తుల‌ను ప‌రిశీలిస్తుంది.

    ఈ క‌ళాశాల ఏర్పాటును దృష్టిలో పెట్టుకొని ప్ర‌భుత్వం వైద్య విద్య విభాగం (DME)లో డీఎంఈ డాక్టర్లు, పారా మెడికల్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తోంది స‌న్నాహాలు చేస్తోంది. ప్ర‌భుత్వం క‌రోనా త‌రువాత ప్ర‌భుత్వం వైద్య రంగం అభివృద్ధిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. ప‌లు చోట్ల వైద్య క‌ళాశాల‌ల ఏర్పాటుకు హామీ ఇచ్చింది.

    ISRO Courses : గ్రాడ్యుయేట్‌ల‌కు గుడ్ న్యూస్‌.. ఇస్రోలో రిమోట్‌సెన్సింగ్‌పై రెండు నెల‌ల‌ కోర్సుకు ద‌ర‌ఖాస్తుల‌ ఆహ్వానం

    వీటన్నీంటి నేప‌థ్యంలోనే ఎనిమిది కొత్త క‌ళాశాల‌ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఈ నేప‌థ్యంలోనే మెడిక‌ల్ క‌మిష‌న్ క‌ళాశాల‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించేందుకు వ‌స్తోంది.

    రాష్ట్రంలో 5250 ఎంబీబీఎస్‌సీట్లు..
    ఎంఓఎస్ హెల్త్ డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అందించిన డేటా వివ‌రాలు ఇలా ఉన్నాయి. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో 34 మెడిక‌ల్ కళాశాల‌లు ఉన్నాయి. ఇందులో 11 మాత్ర‌మే వైద్య క‌ళాశాలలు ఉన్నాయి. మిగిలినవి ప్రైవేటు క‌ళాశాల‌లు ఉన్నాయి. మొత్తం ప్ర‌భుత్వ‌, ప్రైవేటు క‌ళాశాల‌ల్లో క‌లిపి మొత్తం 5240 (ఎంబీబీఎస్‌) MBBS సీట్లు ఉన్నాయి.

    Wipro Recruitment : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఈ ఏడాది విప్రోలో 17,000 కొత్త ఉద్యోగాలు


    వీటిలో1790 MBBS సీట్లు ప్రభుత్వ రంగానికి చెందినవి- తొమ్మిది వైద్య కళాశాలల్లో 1640 సీట్లు, ESI లో 100 సీట్లు ఉన్నాయి. 50 ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (బీబీనగర్ క్యాంపస్)లో ఉన్నాయి. ఇక 23 ప్రైవేటు క‌ళాశాల‌ల్లో 3,450 MBBS సీట్లు ఉన్నాయి.

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడ‌క ముందు ఈ ప్రాంతంలో కేవలం ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. ఉస్మానియా, గాంధీ, కాకతీయ, ఆదిలాబాద్‌లో నిజామాబాద్, రాజీవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Rajive Institute of medical Sciences) తరువాత, మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట క‌ళాశాల‌లు చేర్చ‌బ‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో ఎనిమిది కొత్త ప్రతిపాదిత వైద్య కళాశాలలకు ఆమోదం ల‌భించింది. ఒక అపెక్స్ మెడికల్ రెగ్యులేటర్ బృందం వీటిని సందర్శించాలని భావిస్తున్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Doctors, Health department, Kothagudem, Medical colleges, Ramagundam, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు