హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Scholarship: నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్‌ అప్లికేషన్స్ గడువు పొడిగింపు.. పూర్తి వివరాలు ఇవే..!

Scholarship: నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్‌ అప్లికేషన్స్ గడువు పొడిగింపు.. పూర్తి వివరాలు ఇవే..!

Scholarship: నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్‌ అప్లికేషన్స్ గడువు పొడిగింపు.. పూర్తి వివరాలు ఇవే..!

Scholarship: నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్‌ అప్లికేషన్స్ గడువు పొడిగింపు.. పూర్తి వివరాలు ఇవే..!

నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ అప్లికేషన్స్‌కు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించారు. దీంతో అర్హత ఉన్న విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) అధికారిక వెబ్‌సైట్‌ scholarships.gov.in ద్వారా కొత్త అప్లికేషన్లు పెట్టుకోవచ్చు, రెన్యువల్ చేసుకోవచ్చు.  

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

ఆర్థికంగా వెనుకబడి, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఏటా నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ (NMMSS) స్కీమ్‌ను అమలు చేస్తోంది. దీని ద్వారా పేద విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్కౌలర్‌షిప్(Scholarship) అందజేస్తూ వారిని ప్రోత్సహిస్తోంది. తాజాగా ఈ ఏడాదికి సంబంధించిన స్కాలర్‌షిప్ స్కీమ్ అప్లికేషన్స్‌కు(Applications) గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించారు. దీంతో అర్హత ఉన్న విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) అధికారిక వెబ్‌సైట్‌ scholarships.gov.in ద్వారా కొత్త అప్లికేషన్లు పెట్టుకోవచ్చు, రెన్యువల్ చేసుకోవచ్చు.

NMMSS స్కాలర్‌షిప్ స్కీమ్ వివరాలు

- ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి రూ.12,000 స్కాలర్‌షిప్ ఇవ్వనున్నారు. తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్ వరకు స్కాలర్‌షిప్ అందనుంది.

- ఏటా కొత్తగా లక్ష స్కాలర్‌షిప్‌లను మంజూరు చేస్తారు.

- రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్‌షిప్ మంజూరు చేయనున్నారు.

- ఈ స్కాలర్‌షిప్ పథకానికి విద్యార్థులను ఎంపిక చేయడానికి అర్హత పరీక్ష నిర్వహించనున్నారు.

- విద్యార్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపేటప్పుడు తమకు సంబంధించిన బ్యాంక్ వివరాలను సమర్పించాలి. బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి.

- 8వ తరగతిలో డ్రాపౌట్‌లను నివారించడానికి, సెకండరీ ఎడ్యుకేషన్‌లో పేద విద్యార్థులు తమ విద్యను కొనసాగించేలా ప్రోత్సహించడమే ఈ స్కీమ్ లక్ష్యం.

C-DAC Recruitment: B Tech, M Tech అర్హతతో సీ-డ్యాక్‌లో(C-DAC)లో ఉద్యోగాలు.. జీతం రూ. 12లక్షలు..

అర్హత ప్రమాణాలు

ఎన్‌ఎంఎంఎస్‌ఎస్ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే.. విద్యార్థులు 7వ తరగతి వార్షిక పరీక్షలో కనీసం 55 శాతం మార్కులు లేదా అందుకు సమానమైన గ్రేడ్ స్కోర్ చేసి ఉండాలి. ఇక, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకు 50శాతం మార్కులు వచ్చి ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 3,50,000 లోపు ఉండాలి.

అప్లికేషన్ ప్రాసెస్

స్టెప్-1: ముందుగా నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్(NSP) అధికారిక వెబ్‌సైట్ scholarships.gov.inను సందర్శించాలి.

స్టెప్-2:NMMSS స్కాలర్‌షిప్ -2022 లింక్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్-3: ఇన్‌స్ట్రక్షన్ ప్రకారం.. అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి.

స్టెప్-3: అన్ని వివరాలను క్రాస్-చెక్ చేసి, చివరకు అప్లికేషన్ ఫారమ్‌ను సబ్‌మిట్ చేయండి.

స్టెప్-4: కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసి, భవిష్యత్ అవసరాల కోసం ఫ్రింట్ తీసుకోండి.

JRF 2022: పీజీ పూర్తి చేశారా.. అయితే రెండేళ్ల పాటు నెలకు రూ.31వేలు పొందే అవకాశం..

అవసరమైన డాక్యుమెంట్లు

విద్యార్థులు వారి ఎడ్యుకేషన్‌కు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సినవసరం లేదు. అయితే ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఎడిట్‌కు అవకాశం ఉండదు. దీంతో అప్లికేషన్ నింపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Scholarships

ఉత్తమ కథలు