హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Jobs: వరంగల్ NITలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండిలా..

Telangana Jobs: వరంగల్ NITలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండిలా..

Telangana Jobs: వరంగల్ NITలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండిలా..

Telangana Jobs: వరంగల్ NITలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండిలా..

Telangana Jobs: తెలంగాణలో ఇటీవల వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ప్రభుత్వం భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తుండటంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత ఉద్యోగాలతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగాలను కూడా ప్రభుత్వం భర్తీ చేస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana | Warangal

తెలంగాణలో ఇటీవల వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లు(Notifications) జారీ అవుతున్నాయి. ప్రభుత్వం భారీగా ఉద్యోగాలు(Jobs) భర్తీ చేస్తుండటంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత ఉద్యోగాలతో పాటు కాంట్రాక్ట్(Contract) ఉద్యోగాలను కూడా ప్రభుత్వం భర్తీ చేస్తోంది. ఈ క్రమంలో నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లోనున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(National Institute Of Technology).. లైబ్రరీ ట్రైనీ(Library Trainee) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఎంఎల్‌ఐఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్ డేటా ప్రాసెసింగ్‌లో నాలెడ్జ్‌ ఉండాలి. టెక్నికల్ లైబ్రరీలో పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తుదారుల వయసు 28 ఏళ్లకు మించకుండా ఉండాలి.

Abroad For Education: విదేశాల్లో చదువు కోసం వెళ్తున్నారా..? అయితే వీటిని తప్పక తెలుసుకోండి..

దీనికి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజును చెల్లించి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్‌ 28, 2022. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 6 పోస్టులను భర్తీ చేస్తారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంఎల్ఐసీ(M.L.I.Sc) ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించాలి. దీంతో పాటు.. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. టెక్నికల్ లైబ్రరీలో అనుభవం ఉన్నవారికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది.

సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.15వేలు చెల్లిస్తారు.

Software Jobs: TCS, Wipro, Accenture, TATAలో ఉద్యోగాలు .. రూ. లక్షల్లో జీతం

రెండు సంవత్సరాల కాల పరిధికి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారు. పనితీరు ఆధారంగా ఈ కాంట్రాక్ట్ పొడిగించే అవకాశం ఉంటుంది.

అభ్యర్థుల యొక్క వయస్సు 28 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

Jobs In SSC: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరో భారీ నోటిఫికేషన్.. డిగ్రీతో 990 పోస్టులు భర్తీ..

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో ఈ అడ్రస్ కు పోస్ట్ ద్వారా పంపించాలి. దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా.. రిజిస్ట్రార్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ - 506 004 (TS). రాత పరీక్ష, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫారమ్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Nit, Warangal

ఉత్తమ కథలు