Jobs: నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్‌లో 495 జాబ్స్... మార్చి 26 చివరి తేదీ

NIC Recruitment 2020 | నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్-NIC సైంటిస్ట్, సైంటిఫిక్ / టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: March 24, 2020, 10:26 AM IST
Jobs: నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్‌లో 495 జాబ్స్... మార్చి 26 చివరి తేదీ
NIC Recruitment 2020: నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్‌లో 495 ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్-NIC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిస్ట్, సైంటిఫిక్ / టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 495 ఖాళీలను ప్రకటించింది. ఆసక్తి గల అభ్యర్థులు https://www.calicut.nielit.in/nic/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 26 చివరి తేదీ. అభ్యర్థులకు నోటిఫికేషన్‌లో వివరించిన విద్యార్హతలు ఉంటే చాలు. అనుభవం లేకపోయినా దరఖాస్తు చేయొచ్చు.

NIC recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 495

సైంటిస్ట్ బీ- 288
సైంటిఫిక్ / టెక్నికల్ అసిస్టెంట్- 207
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 26


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 26విద్యార్హత- సైంటిస్ట్ పోస్టుకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అక్రిడిటేషన్ ఆఫ్ కంప్యూటర్ కోర్సెస్ బీ లెవెల్ లేదా అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్స్ లేదా గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీర్స్ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ లేదా ఎంసీఏ లేదా ఎంఈ, ఎంటెక్ లేదా ఎంఫిల్. సైంటిఫిక్ / టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్సెస్, కంప్యూటర్ అండ్ నెట్‌వర్కింగ్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేటిక్స్‌లో ఎంఎస్సీ, ఎంఎస్, ఎంసీఏ, బీఈ, బీటెక్.
వయస్సు- జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 35 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 33 ఏళ్లు. దివ్యాంగులకు 40 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jobs: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో 200 ట్రైనీ పోస్టులు... ఖాళీల వివరాలివే

Jobs: నేషనల్ అల్యూమినియం కంపెనీలో 120 ఉద్యోగాలు

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 404 జాబ్స్... వివరాలివే

 
First published: March 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు