NATIONAL HOUSING BANK RECRUITMENT 2021 APPLICATIONS INVITING FOR MANAGER JOBS FROM DEGREE PASSED CANDIDATES DEC 30 IS LAST DATE FOR APPLICATIONS NS
Bank Jobs 2021: అలర్ట్.. డిగ్రీ అర్హతతో ఆ బ్యాంకులో జాబ్స్.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్
అలర్ట్.. డిగ్రీ అర్హతతో ఆ బ్యాంకులో జాబ్స్.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఈ రోజు అంటే డిసెంబర్ 30 లాస్ట్ డేట్.
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (National Housing Bank) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మేనేజర్ (Manager) పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ (Job Application Process) ఇప్పటికే ప్రారంభం కాగా.. డిసెంబర్ 30ని లాస్ట్ డేట్ గా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఖాళీల వివరాలు..
S.No.
పోస్టు
ఖాళీలు
1.
అసిస్టెంట్ మేనేజర్
14
2.
డిప్యూటీ మేనేజర్
2
3.
రీజినల్ మేనేజర్
1
అర్హతల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్:60 శాతం మార్కులతో డిగ్రీ విద్యార్హత సాధించిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. SC/ST/PwBD అభ్యర్థులకు 55 శాతం మార్కులను కటాఫ్ గా నిర్ణయించారు. CA చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే సమయంలో అభ్యర్థులు మార్క్ షీట్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. Singareni Jobs 2022: న్యూ ఇయర్ లో సింగరేణిలో కొలువుల జాతర.. విభాగాల వారీగా ఖాళీల వివరాలివే..
డిప్యూటీ మేనేజర్:ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. MBA(Finance) చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇనిస్ట్యూట్స్ లో రెండేళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి. రీజినల్ మేనేజర్: గ్రాడ్యుయేట్ డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. కార్పొరేట్ క్రెడిట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ లో రెండేళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. UPSC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. యూపీఎస్సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్
Step 5:దీంతో మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మొదటగా Click here for New Registration ఆప్షన్ ను ఎంచుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. Step 6: పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనంతరం మీకు రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించబడుతుంది. Step 7:తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నంబర్ సహాయంతో లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ను నింపాలి.
Step 8: అప్లై చేసుకునే సమయంలో అభ్యర్థులు రూ. 850ని అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/PwBD అభ్యర్థులకు రూ. 175ని అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించారు. Step 9:అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేసిన అనంతరం ఫామ్ ను ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.