హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs In NHIDCL: రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాలు.. ఎంపికైతే జీతం రూ.2లక్షలకు పైగానే..

Jobs In NHIDCL: రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాలు.. ఎంపికైతే జీతం రూ.2లక్షలకు పైగానే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపిక అయితే... మీరు మంచి జీతం పొందుతారు. భారత ప్రభుత్వ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ క్రింద ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 56 సంవత్సరాల వయస్సు గల అనుభవజ్ఞులైన ఉండాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్ మరియు డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తారు.

AP-TS Teacher Posts: టీచర్ ఉద్యోగాలు .. డీఎస్సీ ఉద్యోగ ప్రకటల తాజా సమాచారం..

అధికారిక నోటీసులో ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ యొక్క ఈ పోస్ట్‌లకు దరఖాస్తులు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురించబడిన తేదీ నుండి నాలుగు వారాల్లోగా చేయవచ్చు. మార్చి 20 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. దీని ప్రకారం ఏప్రిల్ 17 చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఈ తేదీలోపు ఫారమ్‌ను పూరించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

పోస్టును బట్టి విద్యార్హతలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు.. జనరల్ మేనేజర్ పోస్టులకు కనీసం 14 సంవత్సరాల పని అనుభవం ఉన్న సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్యూటీ జనరల్ మేనేజర్ కోసం అదే విద్యార్హత మరియు 9 సంవత్సరాల అనుభవం ఉంటే.. దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితిని 56 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఈ సంవత్సరం పైబడిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు.

జీతం ఇలా..

జనరల్ మేనేజర్ పోస్టుకు నెలకు రూ.1,23,100 నుంచి రూ.2,15,900 వరకు జీతం లభిస్తుంది. డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు 78 వేల నుంచి 2 లక్షల వరకు జీతం పొందవచ్చు. అదేవిధంగా.. మేనేజర్ మరియు డిప్యూటీ మేనేజర్ పోస్టులకు గరిష్ట వేతనం రెండు నుండి మూడు లక్షల రూపాయలు ఉంటుంది.

దరఖాస్తుల ప్రక్రియ ఇలా..

-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

-తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. దాని కొరకు ఇక్కడ క్లిక్ చేయవచ్చు.

-ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలతో పాటు.. విద్యార్హత వివరాలను నమోదు చేయాలి. తర్వాత మీ మొబైల్ కు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్ వర్డ్ వస్తుంది.

-వాటి సాయంతో.. లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీనిలో మీ దరఖాస్తు ఫారమ్ ను పూర్తి చేయవచ్చు.

First published:

Tags: Central Government Jobs, JOBS

ఉత్తమ కథలు