హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Btech-Mtech Students: బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేషనల్ హైవే అందిస్తున్న ఆఫర్ ఇదే..

Btech-Mtech Students: బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేషనల్ హైవే అందిస్తున్న ఆఫర్ ఇదే..

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

కేంద్ర రోడ్డు రవాణా - జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ.. నేషనల్ హైవే ప్రాజెక్టుల కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IIT), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ లో పాల్గొనవచ్చు.

ఇంకా చదవండి ...

కేంద్ర రోడ్డు రవాణా - జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ.. నేషనల్ హైవే ప్రాజెక్టుల కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IIT), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో(Private Engineering Colleges) చదువుతున్న విద్యార్థులు(Students) ఈ ఇంటర్న్‌షిప్(Internships) లో పాల్గొనవచ్చు.

* అర్హతలు

బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులతో పాటు ఎంటెక్ చేసిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే బీటెక్, ఎంటెక్‌లో సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. గత సెమిస్టర్‌లలో 7.0 లేదా 70 శాతం మార్కులతో CGPA సాధించి ఉండాలి. ఇంటర్న్‌షిప్ కోసం ఎంపికైన బీటెక్ విద్యార్థులకు నెలకు రూ. 10,000, ఎంటెక్ విద్యార్థులు రూ. 15,000 స్టైఫండ్‌ అందుకుంటారు. అలాగే ఇంటర్న్‌ల వసతి, రవాణా ఖర్చులను కూడా కేంద్ర రోడ్డు రవాణా శాఖ భరించనుంది.

ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 15, 2022గా నిర్ణయించారు. ఈ ఇంటర్న్‌షిప్ మూడు నెలల పాటు ఉంటుంది. ఇక్కడ విద్యార్థులు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఇంజనీరింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఇంటర్న్‌షిప్ పోర్టల్ aicte-india.org ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Dental Insurance: PNB మెట్‌లైఫ్ నుంచి కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్.. మొదటిసారి ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ లాంచ్..


ఇంటర్న్‌షిప్ సమయంలో మార్కుల కేటాయింపు వివరాలు

ఇంటర్న్‌షిప్ లెర్నింగ్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌పై ప్రజెంటేషన్ కోసం 20 మార్కులు కేటాయిస్తారు. ఇంటర్న్‌షిప్ లెర్నింగ్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌పై నివేదిక సమర్పించడం కోసం 40 మార్కులు, కాంట్రాక్టర్/రాయితీదారు ప్రాజెక్ట్ మేనేజర్ ద్వారా సాధారణ అంచనాకు 10 మార్కులు ఇవ్వనున్నారు. AE/IE/PMC టీమ్ లీడర్ ద్వారా సాధారణ అంచనా కోసం 10 మార్కులు, NHAI/NHIDCL/BRO/స్టేట్ PWDకి సంబంధించిన PD/EE ద్వారా జనరల్ అసెస్‌మెంట్‌కు10 మార్కులు కేటాయిస్తారు. ఇంటర్న్‌షిప్‌లో పాల్గొన్న అభ్యర్థుల అటెన్‌డెన్స్‌కు 10 మార్కులు కేటాయిస్తారు.

మరోవైపు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఆధ్వర్యంలో అందుబాటులో మరికొన్ని ఇంటర్న్‌షిప్‌ల జాబితాను పరిశీలిద్దాం.

AICTE బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్) ఇంటర్న్‌షిప్ -2022

ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన అభ్యర్థులు 12 నెలల పాటు మెర్రీ గో లెర్న్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది.

అర్హతలు

బిజినెస్ డెవలప్‌మెంట్‌ను కెరీర్‌గా ఎంచుకునే అభ్యర్థులు ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు తప్పనిసరిగా ఇంగ్లీష్‌పై మంచి పట్టు ఉండాలి. అలాగే అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్య పరిష్కారం, ప్రజెంటేషన్, సంస్థాగత నైపుణ్యాలను కలిగి ఉండాలి. ప్రతిభను బట్టి అభ్యర్థులకు నెలకు రూ. 8,000 రివార్డ్ రూపంలో ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు https://internship.aicte-india.org/internship-details.php?uid=INTERNSHIP_1650457299625ffad38fa1e అనే లింక్‌పై క్లిక్ చేయండి.

AICTE తులిప్ ఫైనాన్స్ ఇంటర్న్‌షిప్ -2022

తులిప్ ఫైనాన్స్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ప్రత్యేక చొరవ తీసుకుంది. కంపెనీ ఫైనాన్స్, వివిధ స్కీమ్‌ల కోసం నిధుల వినియోగం, ఆర్థిక నివేదికలను తయారు చేయడం, అంతర్గత ఆడిట్‌లలో సహకారం అందిచడం వంటి రోజువారీ కార్యకలాపాలపై అవగాహన కల్పించడం వంటి వాటిని సులభతరం చేయడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం.

అర్హతలు

BA డిగ్రీ పూర్తి చేసి అభ్యర్థులు ఈ ఇంటర్న్‌షిప్‌‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు రివార్డుల రూపంలో నెలకు రూ. 10వేలు అందనుంది. ఈ ప్రోగ్రామ్ కోసంఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 31గా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ https://internship.aicte-india.org/internship-details.php?uid=INTERNSHIPGOV_1650431692625f96cc4bdfa&level=2 పై క్లిక్ చేయండి.

First published:

Tags: Career and Courses, Interships, Nhai

ఉత్తమ కథలు