NHM Telangana Recruitment 2022 | నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణలో డిస్ట్రిక్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా డిస్ట్రిక్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. ఈ పోస్టులకు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. అంటే అభ్యర్థులు దరఖాస్తుల్ని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పోస్టులో దరఖాస్తుల్ని పంపించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు విద్యార్హతలతో పాటు అనుభవం కూడా తప్పనిసరి. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
NHM Telangana Recruitment 2022: నోటిఫికేషన్ వివరాలు ఇవే...
భర్తీ చేసే పోస్టు- డిస్ట్రిక్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్
దరఖాస్తు ప్రారంభం- 2021 డిసెంబర్ 17
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 27 సాయంత్రం 5 గంటలు
విద్యార్హతలు- మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్, మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్స్ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ పాస్ కావాలి.
అనుభవం- హాస్పిటల్ మేనేజ్‌మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో మూడేళ్ల అనుభవం తప్పనిసరి. ఇంగ్లీష్‌లో ఫ్లూయెన్సీ, కంప్యూటర్ లిటరసీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
దరఖాస్తు ఫీజు-ఓసీ, బీసీ నాన్ క్రీమీలేయర్ అభ్యర్థులకు రూ.500, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు రూ.250. “The State Health Society, Telangana” payable at Hyderabad పేరుతో డీడీ తీయాలి.
Step 2- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేయాలి.
Step 3- దరఖాస్తు ఫామ్‌కు ఫోటో, ఆధార్ కార్డ్, టెన్త్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.
Step 4- దరఖాస్తు ఫీజు డీడీ జత చేయాలి.
Step 5- దరఖాస్తుల్ని రిజిస్టర్డ్ పోస్టులో లేదా స్వయంగా సబ్మిట్ చేయాలి.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Chief Administrative Officer,
O/o Mission Director,
National Health Mission,
Telangana State,
4th Floor, DME Building,
DM&HS Campus,
Koti, Hyderabad.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.