నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్( NGT) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్(Recruitment) లో అసిస్టెంట్(Assistant), స్టెనోగ్రాఫర్ గ్రేడ్(Stenographer Grade), లైబ్రేరియన్(Librarian), స్టాఫ్ కార్ డ్రైవర్(Staff Card Driver) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ (NGT) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వెబ్ సైట్ కు(Web Site) వెళ్లి నోటిఫికేషన్ లో ఇచ్చిన దరఖాస్తు ఫాం డౌన్ లోడ్(Download) చేసుకొని .. తగిన వివరాలను నింపి.. అర్హతగల డాక్యుమెంట్లను(Documents) ఆఫ్ లైన్ ద్వారా రిజిస్ట్రార్ జనరల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ప్రిన్సిపల్ బెంచ్,ఫరిద్ కోట్ హౌస్, Copernicus Marg, New Delhi-110001 అడ్రస్ కు 25 జూలై,2022లోపు పంపించాల్సి ఉంటుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT దరఖాస్తు ఫారమ్... నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT ఖాళీల కోసం https://www.greentribunal.gov.in/job-opening ఈ లింక్‌పై క్లిక్ చేయండి. దరఖాస్తు రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. కేటగిరీల వారీగా ఖళీ పోస్టులు ఇవే..
అసిస్టెంట్ (జుడీషియల్) - 06 పోస్టులు, వయో పరిమితి 21-30 సంవత్సరాలు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ I — 04 పోస్టులు, వయో పరిమితి 21 -30 సంవత్సరాలు
హిందీ ట్రాన్స్ లేటర్ — 01 పోస్టులు, వయో పరిమితి 23 - 32 సంవత్సరాలు
లైబ్రేరియన్ - 02 పోస్టులు, వయో పరిమితి 21 - 30 సంవత్సరాలు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II — 09 పోస్టులు, వయో పరిమితి 21 నుంచి 27 సంవత్సరాల మధ్య
స్టాఫ్ కార్ డ్రైవర్ - 05 పోస్టులు, వయో పరిమితి 18 - 27 సంవత్సరాలు
అర్హతలు..
అసిస్టెంట్ (జ్యుడిషియల్) - దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ I - దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.
హిందీ ట్రాన్స్ లేటర్ - దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి తప్పనిసరి లేదా ఎంపిక సబ్జెక్ట్‌గా ఇంగ్లీష్ లేదా హిందీ/ఇంగ్లీషులో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.
లైబ్రేరియన్ - దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి లైబ్రరీ సైన్స్/లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్లోబ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II - దరఖాస్తుదారులుఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ పాస్ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు.. టైపింగ్ ఇంగ్లీష్ లో హైయర్ తో పాటు.. స్టెనో సర్టిఫికేట్ పొంది ఉండాలి.
స్టాఫ్ కార్ డ్రైవర్ - దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు.. మోటార్ మెకానిక్ కు సంబంధించి నాలెడ్జ్ ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Google Assistant, JOBS, National green tribunal