NATIONAL EMPLOYMENT POLICY GOVT TAKE STEP FOR SET UP EXPERT PLANS FOR DRAFTING EVK
National Employment Policy: ఏమిటీ జాతీయ ఉపాధి విధానం..? త్వరలో నిపుణుల కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వ యోచన
ప్రతీకాత్మక చిత్రం
National Employment Policy: మారుతున్న కాలానికి అనుగుణంగా దేశంలో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించేదుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా జాతీయ ఉపాధి విధానం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా దేశంలో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించేదుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా జాతీయ ఉపాధి విధానం (National Employment Policy) కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ కమిటీ లో వివిధ రకాల పరిశ్రమలకు చెందిన ప్రముఖలు, కార్మిక, ఇతర మంత్రిత్వ శాఖల ప్రతినిధులు ఉంటారని పలువురు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. దేశంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి పవర్ కమిటీ (Power Committee)ని ఏర్పాటు చేయవచ్చని, అందులో కమిటీ అభిప్రాయాలు, సిఫార్సులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఉపాధి కల్పించే పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, విధానపరమైన అంశాలు, దేశీయంగా అనుకూల వాతావరణాన్ని సృష్టించడం ద్వారా కొత్త పరిశ్రమలను ఆకర్షించడం వంటి అంశాలను కమిటీ పరిశీలిస్తుంది.
ఈ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఉద్యోగ కల్పనను పెంచేందుకు ఉపయోగపడతాయి. జాతీయ ఉపాధి విధానం రంగాల వారీగా ఉపాధి అవకాశాలపై వ్యూహాన్ని సిద్ధం చేస్తుంది.
డేటా సేకరణ..
- ఉపాధి అవకాశాలను పరిశీలించేందుకు ఐదు ఆల్-ఇండియా లేబర్ సర్వే (All India Labour Survey)లతోపాటు ఈ-శ్రమ్ పోర్టల్ (E-Shram) నుంచి డేటా సేకరిస్తారు.
- కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ యొక్క అనుబంధ కార్యాలయమైన లేబర్ బ్యూరోచే నిర్వహించబడిన ఐదు దేశవ్యాప్త వార్షిక సర్వేలలో AQEES ఒకటి.
- వలస కార్మికుల ఆల్-ఇండియా సర్వే, గృహ కార్మికులకు సంబంధించిన ఆల్-ఇండియా సర్వే, ప్రొఫెషనల్స్ ఉద్యోగాలకు సంబంధించిన ఆల్-ఇండియా సర్వే, రవాణా రంగానికి సంబంధించిన ఆల్-ఇండియా (India) సర్వే. ఈ ఐదు సర్వేల ఆధారంగా డేటాను సేకరిస్తారు.
- ఈ డేటా బేస్ అసంఘటిత రంగానికి సంబంధించిన సమాచారం సేకరించడానికి ఉపయోగపడుతుంది. ఈ డేటా (DATA) ఆధారంగా చిన్న ఉపాధి అవకాశాలను కలిగిన వారికి ఎంతో ఉపయోగ పడతుందని ప్రభుత్వం చెబుతుంది.
ఈ-శ్రమ్
ఆగస్ట్ 26, 2021న, కార్మిక మంత్రిత్వ శాఖ అసంఘటిత కార్మికుల కోసం నేషనల్ డేటాబేస్ లేదా ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. నిర్మాణ కార్మికులు, గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ కార్మికులు, వీధి వ్యాపారులు, గృహ, వ్యవసాయ మరియు వలస కార్మికులు, అసంఘటిత కార్మికుల ఇతర ఉప సమూహాలతో సహా 380 మిలియన్ల అనధికారిక, అసంఘటిత కార్మికుల వివరాలు నమోదు చేయడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది.
పెరుగుతున్న నిరుద్యోగం..
దేశంలో నిరుద్యోగం (Unemployment) పెరుగుతున్న నేపథ్యంలో NEPను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రైవేట్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) ప్రకారం, ఏప్రిల్ 2020లో, దేశం దేశవ్యాప్తంగా లాక్డౌన్లో ఉన్నప్పుడు నిరుద్యోగిత రేటు రికార్డు స్థాయిలో 23.52 శాతానికి చేరుకుంది. CMIE ప్రకారం, ఏప్రిల్-జూన్ 2020-21 త్రైమాసికంలో, దాదాపు 121 మిలియన్ల ఉద్యోగాలు పోయాయి. ఇది ఉపాధి డేటాను కంపైల్ (Compile) చేయడం ప్రారంభించినప్పటి నుంచి రికార్డు స్థాయిలో నెలవారీ అత్యధిక ఉద్యోగాలు కోల్పోవడం.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.