హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET-UG 2021 : సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే​ నీట్ ఫలితాలు.. రిజల్ట్ ఇలా చెక్​ చేసుకోండి..

NEET-UG 2021 : సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే​ నీట్ ఫలితాలు.. రిజల్ట్ ఇలా చెక్​ చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEET-UG 2021 : నీట్ యూజీ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అభ్యర్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో నీట్ ఫలితాన్ని చెక్​ చేసుకోవచ్చు.

మెడికల్​ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్​)- యూజీ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్​టీఏ) విడుదల చేయనుంది. అయితే నీట్​ పరీక్షలో అవకతవకలు జరిగాయని, ఫలితాలను నిలుపుదల చేయాలని గతంలో ఇద్దరు విద్యార్థులు బాంబే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిపిందే. బాంబే హైకోర్టు వారికి అనుకూలమైన తీర్పునివ్వడంతో ఫలితాల విడుదల నిలిచిపోయింది. కానీ తాజాగా బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఇద్దరు విద్యార్థుల కోసం 16 లక్షల మంది ఫలితాలను ఆపలేమని స్పష్టం చేసింది. ఫలితాలు ప్రకటించేందుకు నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీకి అనుమతి ఇచ్చింది. దీంతో, ఎట్టకేలకు నీట్–యూజీ ఫలితాల విడుదలకు లైన్​ క్లియర్​ అయ్యింది. ఒకట్రెండ్​ రోజుల్లో ఫలితాలు విడుదలకానున్నాయి.

* నీట్ ఫలితాలను ఎలా చెక్​ చేసుకోవాలి?

స్టెప్​ 1: NEET 2021 అధికారిక వెబ్‌సైట్ www.neet.nta.nic.inని సందర్శించండి.

స్టెప్​ 2: “రిజల్ట్​ – నీట్​ (యూజీ) 2021” లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3: నీట్​–2021 ఎంట్రన్స్​ ఎగ్జామ్​ హాల్​టికెట్​ నెంబర్​తో లాగిన్ అవ్వండి.

స్టెప్​ 4: నీట్–2021 ఫలితాలు​ స్క్రీన్​పై కనిపిస్తాయి.

స్టెప్​ 5: రిజల్ట్​ కాపీని​ డౌన్‌లోడ్ చేసుకొని. భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్​ అవుట్​ తీసుకోండి.

ఇది కూడా చదవండి : ఏపీలో టెన్త్, ఇంటర్ అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

నీట్ యూజీ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అభ్యర్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో నీట్ ఫలితాన్ని చెక్​ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి : ఐఐటీ విద్యార్థుల పరిశోధనలకు శామ్‌సంగ్ ప్రోత్సాహకం.. 130 మంది స్టూడెంట్స్‌కు రిసెర్చ్ ఫెలోషిప్ ప్రకటన

నీట్​–2021 రిజల్ట్​​ పీడీఎఫ్​లో సబ్జెక్ట్ వారీగా నీట్​ పర్సంటైల్, మొత్తం మార్కులు, ఆల్ ఇండియా ర్యాంక్ (AIR), కేటగిరీ ర్యాంక్, ఆల్ ఇండియా కోటా (AIQ) ర్యాంక్ వంటివి ఉంటాయి. నీట్​ యూజీ 2021 పరీక్ష ద్వారా భారతదేశంలోని 83,075 మెడికల్, 26,949 డెంటల్, 52,720 ఆయుష్, 603 వెటర్నరీ సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. నీట్​–2021 ఎగ్జామ్​లో క్వాలిఫై అయిన అభ్యర్థులను కౌన్సెలింగ్‌కు పిలుస్తారు.

First published:

Tags: Career and Courses, Exam results, NEET 2021, Results, Supreme Court

ఉత్తమ కథలు