మహిళలకు సైబర్ భద్రతపై(Cyber Security) అవగాహన కల్పించేందుకు తాజాగా ఆన్లైన్ రిసోర్స్ సెంటర్‌ను(Center) ప్రారంభించింది జాతీయ మహిళా కమిషన్(National Womens Commission). మహిళలపై జరిగే వివిధ నేరాలు సహా సైబర్ సెక్యూరిటీ, సురక్షిత సాంకేతికత వినియోగంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రారంభించిన ఈ ఆన్లైన్ రిసోర్స్ సెంటర్లు గత ఏడాది డిసెంబర్ 9న అందుబాటులోకి వచ్చాయి. దీనికి ఎన్సీడబ్ల్యూ, మెటా(ఫేస్బుక్ మాతృసంస్థ), సైబర్‌పీస్ ఫౌండేషన్(CyberPeace Foundation), ఆటోబూట్ ఇన్ఫో(Autobot Infosec Pvt Ltd) సంస్థలు సంయుక్త సహకారం అందించనున్నాయి. ‘వి థింక్ డిజిటల్-డిజిటల్ శక్తి 3.0’ ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందిన ఈ కేంద్రాలు.. మహిళలపై పెరిగిపోతున్న సైబర్ హింసను ఎదుర్కోవడంలో సహాయపడనున్నాయని.. సాంకేతిక దుర్వినియోగాన్ని నిరోధించడంలో దోహదపడతాయని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్(ncw chairman) రేఖా శర్మ(Rekha Sharma) అన్నారు.
"వి థింక్ డిజిటల్ - డిజిటల్ శక్తి 3.0" ప్రోగ్రామ్ మూడో దశ 2021 మార్చిలో ప్రారంభమైంది. ఇది దేశవ్యాప్తంగా 1.5 లక్షల మంది మహిళలకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ఈ ఆన్లైన్ రీసోర్స్ కేంద్రాల్లో కింది అంశాలకు ప్రాధాన్యతనివ్వనున్నారు.
అవగాహన వీడియోలు: సైబర్ భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై వీడియోల రూపంలో అందుబాటులో ఉంచారు. దీని ద్వారా మహిళలకు ఆయా సమయాల్లో ఎదురవుతున్న సమస్యలను అవగాహన చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ఫలితంగా ముందు జాగ్రత్త చర్యల ద్వారా సైబర్ ముప్పును కలిగి ఉన్న మహిళలను గుర్తించి తమను తాము ఎలా రక్షించుకునేలా వారికి సహాయపడుతుంది.
పోస్టర్లు: ఆన్లైన్ రీసోర్స్ సెంటర్‌ను సందర్శించే వారు వేగంగా అవగాహన పెంచుకునేందుకు చిన్న చిన్న పోస్టర్లను అందుబాటులో ఉంచారు. ఇవి వివిధ సమస్యలపై సంక్షిప్త సమాచారాన్ని అందజేస్తాయి.
సహాయ కేంద్రం: సైబర్ బెదిరింపులు, ఆర్థిక మోసాలు, లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ మొదలైన ఆన్లైన్ నేరాల్లో బాధితులుగా మిగిలిన మహిళలకు రిసోర్స్ సెంటర్లోని ఓ విభాగం సహాకారం అందిస్తుంది. వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక విభాగం ఉంటుంది.
మానసిక ఆరోగ్యం: సైకోమెట్రిక్ అసెస్మెంట్ సేవ ద్వారా.. ఓ మహిళ మానసిక ఆరోగ్యం ఏ అంశం వల్లనైనా ప్రభావితం అయిందా? అని పరిశీలిస్తారు. అంతేగాక.. వారికి అవసరమైన సహాయం అందిస్తారు.
ఈ-లెర్నింగ్: సైబర్ భద్రత సహా.. ఇతర సమస్యలపై ఒక మహిళ పాఠాలు నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది ఎన్సీడబ్ల్యూ(national commission for women).
రిపోర్టింగ్: సైబర్ నేరాల్లో బాధితులుగా మిగిలిన మహిళల కేసుల గురించి నివేదిస్తుంది ఈ విభాగం. దీనికోసం సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్లలో నుంచీ ఫిర్యాదు చేసే వెసులుబాటును కల్పించారు. చట్ట ప్రకారం బాధితురాలికి న్యాయం జరిగేలా ఓ పరిష్కారాన్ని కోరవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.