బ్యాంక్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నవారికి శుభవార్త. డెవలప్‌మెంట్ అసిస్టెంట్, డెవలప్‌మెంట్ అసిస్టెంట్-హిందీ, గ్రూప్-బీ పోస్టుల భర్తీకి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్-NABARD దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 91 ఖాళీలున్నాయి. వాటిలో 82 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులు కాగా, 9 డెవలప్‌మెంట్ అసిస్టెంట్-హిందీ పోస్టులు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 14న ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 2 చివరి తేదీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నాబార్డ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మొత్తం ఖాళీలు- 91
డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులు- 82
డెవలప్‌మెంట్ అసిస్టెంట్-హిందీ పోస్టులు- 9
దరఖాస్తు ప్రారంభం- 2019 సెప్టెంబర్ 14
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 2
ప్రిలిమినరీ ఎగ్జామ్- 2019 అక్టోబర్ 20
వేతనం- రూ.32,000
విద్యార్హత- డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులకు 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. డెవలప్‌మెంట్ అసిస్టెంట్-హిందీ పోస్టులకు హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 35 ఉద్యోగాలు
SBI Jobs: గుడ్ న్యూస్... 477 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగించిన ఎస్‌బీఐ
UPSC Jobs: 597 పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్... వివరాలివే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Banking, CAREER, EMPLOYMENT, JOBS, NOTIFICATION