హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs In NAL: బీటెక్(B Tech), బీఎస్సీ(B.Sc) విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ 75 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండిలా.. 

Jobs In NAL: బీటెక్(B Tech), బీఎస్సీ(B.Sc) విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ 75 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండిలా.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్‌లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ సహా మొత్తం 75 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ పోస్టులకు అభ్యర్థులను డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్‌లో(National Aerospace Laboratories) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్(Project Assistant) సహా మొత్తం 75 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ పోస్టులకు అభ్యర్థులను డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు ఈ పోస్ట్ కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలో(Walk In Interview) పాల్గొనవచ్చు. అక్టోబర్ 20న డైరెక్ట్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పోస్టులను పూర్తిగా తాత్కాలికంగా నియమిస్తారు. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, వేతనాలు, ఎంపిక విధానం మొదలైన ఈ నియామకానికి సంబంధించిన ఇతర ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోండి.

Central Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు .. 110 పోస్టులు ఖాళీ..

సంస్థ పేరు: నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్

ఉద్యోగం పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు

ఉద్యోగం స్థానం: బెంగళూరు

ఖాళీల సంఖ్య: 75

S. Noవిభాగంఖాళీల సంఖ్య
1ప్రాజెక్ట్ అసోసియేట్30
2ప్రాజెక్ట్ అసిస్టెంట్20
3ప్రాజెక్ట్ అసోసియేట్ - II24
4సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 101

జీతం: ప్రతి నెలా రూ.20,000-42,000 చెల్లిస్తారు.

అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 పోస్టులకు 40 ఏళ్ల లోపు.. ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు 50 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి.

విద్యార్హతలు..

ప్రాజెక్ట్ అసోసియేట్ - I పోస్టులకు  BE, BTech MSc పూర్తి చేసి ఉండాలి. ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు డిప్లొమా, B.Sc పూర్తి చేసిన వారు అర్హులు. ప్రాజెక్ట్ అసోసియేట్ - II, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు సమర్పణ:  ఆఫ్‌లైన్ ద్వారా

దరఖాస్తు సమర్పణ చిరునామా: 

CSIR-NAL RAB మీటింగ్ కాంప్లెక్స్, నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ [NAL], SBI పక్కనే, NAL బ్రాంచ్, కోడిహళ్లి, బెంగళూరు – 56001

ఎంపిక ప్రక్రియరాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

Constable Jobs 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 400 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 28 సెప్టెంబర్ 2022

వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 20 అక్టోబర్ 2022

నోటిఫికేషన్ ముఖ్యమైన లింక్‌లు

అధికారిక నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారమ్: ఇక్కడ క్లిక్ చేయండి

అధికారిక వెబ్‌సైట్:  nal.res.in

Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో 1535జాబ్స్ .. ఇలా అప్లై చేసుకోండి

దరఖాస్తు విధానం

-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.

-తర్వాత నోటిఫికేషన్ డౌన్ లోడ్ చేసుకొని వివరాలను పూర్తిగా చదువుకోవాలి.

- అధికారిక నోటిఫికేషన్ నుండి దరఖాస్తు ఫారమ్‌లో ఫారమ్‌ను పూరించండి.

- మొత్తం సమాచారాన్ని పూర్తి చేసిన తర్వాత, అందించిన వివరాలు సరైనవో కాదో తనిఖీ చేయండి. ఆపై పై చిరునామాకు దరఖాస్తు చేసుకోండి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Software, Software developer

ఉత్తమ కథలు