NATION TESTING AGENCY RELEASED CUET UG 2022 NOTIFICATION HERE FULL DETAILS NS
CUET (UG) 2022: సెంట్రల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లకు CUET UG 2022 నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
సెంట్రల్ యూనివర్సిటీల్లోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ CUET(UG)-2022 కు సంబంధించి నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసింది.
సెంట్రల్ యూనివర్సిటీల్లోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ CUET(UG)-2022 కు సంబంధించి నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 6వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లలో పేర్కొన్నారు. ఇంకా పరీక్షను జులై మొదటి, రెండవ వారంలో నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పరీక్షరెండు స్లాట్లలో నిర్వహించనున్నారు. స్లాట్ 1 కు సంబంధించి 3 గంటల 15 నిమిషాల సమయం(195 నిమిషాలు) ఉంటుంది. స్లాట్-2 కు సంబంధించి 3 గంటల 45 నిమిషాల(225 నిమిషాల) సమయం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
- జనరల్/అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు స్లాట్ 1 కోసం రూ.650, స్లాట్ 2 కోసం రూ.650 చెల్లించాల్సి ఉంటుంది.
- జనరల్-EWS/OBC-NCL అభ్యర్థులు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
- ఎస్సీ/ఎస్టీ/PwBD/థర్డ్ జండర్ అభ్యర్థులు రూ.550 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు భారత దేశానికి బయట ఉన్న ఎగ్జామ్స్ సెంటర్లను ఎంచుకుంటే రూ.3 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
- CUET (UG)-2022 పరీక్ష కోసం దేశంలోని 547 సిటీల్లో సంటర్లను ఏర్పాటు చేయగా.. దేశం బయట 13 సిటీల్లో సంటర్లను ఏర్పాటు చేశారు.
-కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ఎగ్జామ్ ఉంటుంది.
-అభ్యర్థులు https://cuet.samarth.ac.in/ వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.