NARAYANA SCHOOLS SENT MESSAGE TO PARENTS THAT NO ONLINE CLASSES FOR STUDENTS WHO PAID FEE LESS THAN RS 20000 NS
Narayana Schools: విద్యార్థులకు షాకిచ్చిన నారాయణ స్కూల్స్.. అంత ఫీజు కట్టని వారికి క్లాసులు బంద్ అంటూ మెసేజ్ లు
ప్రతీకాత్మక చిత్రం
నారాయణ స్కూల్స్ యాజమాన్యం పేరెంట్స్ కు తాజాగా షాక్ ఇచ్చింది. రూ. 20 వేల కన్నా తక్కువగా ఫీజులు చెల్లించిన విద్యార్థులకు రేపటి నుంచి ఆన్లైన్ క్లాసులు ఇక ఉండవని స్పష్టం చేసింది. కరోనా దెబ్బకు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న అనేక మంది పేరెంట్స్ స్కూల్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా దెబ్బకు అనేక మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. ప్రైవేటు ఉద్యోగాలు, ఇతర వ్యాపారాలను నమ్ముకున్న అనేక మంది పరిస్థితిని ఈ మాయదారి కరోనా కుదేలు చేసింది. ఉపాధి పోయిన అనేక మంది తమ కుటుంబాన్ని పోషించడమే భారమైంది. అయితే ఈ కష్ట సమయంలో ఆన్లైన్ క్లాసుల ఫీజుల పేరిట అనేక ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నాయి. అసలే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న అనేక మంది తల్లిదండ్రులను ఫీజుల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నిర్ణీత మొత్తం చెల్లించకుంటే మీ పిల్లలకు ఆన్లైన్ క్లాసులు ఆపేస్తామంటూ హెచ్చరికలు సైతం జారీ చేస్తూ వేధిస్తున్నాయి. తాజాగా నారాయణ స్కూల్స్ యాజమాన్యం పేరెంట్స్ కు ఇలాంటి ఓ మెసేజ్ పంపించింది. రూ. 20 వేల కన్నా తక్కువ ఫీజులు చెల్లించిన విద్యార్థులకు రేపటి నుంచి ఆన్లైన్ క్లాసులు ఇక ఉండవన్నది ఆ మెసేజ్ సారాంశం.
ఫీజులు కట్టవారి ఆన్లైన్ క్లాసులకు సంబంధించిన క్రెడెన్షియల్స్ ఇక పని చేయవని ఆ మెసేజ్ లో యాజమాన్యం స్పష్టం చేసింది. ఇప్పటికే అనేక సార్లు ఈ విషయాన్ని తెలిపామని.. అయినా స్పందన రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అయితే నారాయణ స్కూల్ పంపిన ఈ మెసేజ్ పై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న తమను ఫీజుల పేరిట వేధించడం సరికాదని వారు వాపోతున్నారు.
యాజమాన్యం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఆలోచించి తమ పిల్లలను ఆన్లైన్ క్లాసులకు అనుమతించాలని వారు కోరుతున్నారు. ఫీజులు కట్టలేదని తోటి వారి ముందు ఇలా అవమానానికి గురి చేయడం సరికాదని వారు బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.