ప్రధాన మంత్రి(Prime Minister) నరేంద్ర మోదీ ( Narendra Modi) హైదరాబాద్ (Hyderabad)లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) స్నాతకోత్సవ (Convocation) వేడుకలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన బిజినెస్ స్కూల్ స్టూడెంట్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రధాన మంత్రి(Prime Minister) నరేంద్ర మోదీ ( Narendra Modi) హైదరాబాద్ (Hyderabad)లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) స్నాతకోత్సవ (Convocation) వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బిజినెస్ స్కూల్ స్టూడెంట్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశం అంటే వ్యాపారమని.. ఈ విషయాన్ని ప్రపంచం గుర్తిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పేర్కొన్నారు. భారతదేశం(India) కనిపెట్టిన అనేక సొల్యూషన్స్ ప్రపంచవ్యాప్తంగా. అమలు అవుతున్నాయని ఆయన తెలిపారు. "ఈ ముఖ్యమైన రోజున, మీ వ్యక్తిగత లక్ష్యాలను దేశ లక్ష్యాలతో అనుసంధానించమని నేను మిమ్మల్ని కోరాలనుకుంటున్నాను” అని మోదీ స్టూడెంట్స్‌ను(Students) ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీ-స్కూల్ గ్రాడ్యుయేట్లకు ప్రధానమంత్రి ఐదు సూత్రాలను(Five Formulas) కూడా తెలియజేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సంస్కరణల అవసరం
దేశంలో సంస్కరణల ఆవశ్యకత ఎప్పుడూ ఉంటుందని, అయితే రాజకీయ సంకల్ప బలం ఎప్పుడూ కొరవడుతుందని ప్రధాని అన్నారు. మోదీ చెప్పినట్లుగానే గత మూడు దశాబ్దాలుగా రాజకీయ అస్థిరత కొనసాగుతుండటం వల్ల దేశంలో చాలా కాలంగా రాజకీయ సంకల్ప శక్తి కొరవడింది. అందుకే సంస్కరణలకు, పెద్ద నిర్ణయాలకు దేశం దూరంగా ఉంటూ వస్తోంది. 2014 నుంచి మోదీ అధికారంలోకి రావడంతో దేశం రాజకీయ సంకల్పాన్ని చూస్తోంది. సంస్కరణలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు కూడా కొత్త సంస్కరణలకు మద్దతు తెలుపుతున్నారు. రీఫామ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉందని బీ-స్కూల్ స్టూడెంట్స్‌కు మోదీ సూచించారు.
స్థితిస్థాపకత, బలం
కరోనా సమయంలో దేశ ఆరోగ్య రంగం స్థితిస్థాపకత (Resilience), బలం ఏంటో తెలిసిందన్నారు. కోవిడ్ వ్యాక్సిన్లకు సంబంధించి, విదేశీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయా లేదా అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. కానీ భారత్ తన స్వంత వ్యాక్సిన్లను అభివృద్ధి చేసింది. ఇండియాలో ఏకంగా 190 కోట్లకు పైగా డోస్‌ల టీకాలు తయారు అయ్యాయి. ఇండియా ప్రపంచంలోని 100 కంటే ఎక్కువ దేశాలకు వ్యాక్సిన్లను పంపింది. ఈ విషయాలను తెలుపుతూ స్వశక్తిపై ఆధారపడేలా సిద్ధమవ్వాలని మోదీ అన్నారు.
మెరుగైన ఫలితాలకు దారి తీసే సహకారం
సంస్కరణ పక్రియ (Reform Process)లో బ్యూరోక్రసీ కూడా సమర్థవంతంగా కృషి చేసిందని ప్రధాన మంత్రి చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పథకం విజయవంతం కావడంలో ప్రజల భాగస్వామ్యం అభినందనీయమన్నారు. ప్రజలు సహకరిస్తే త్వరితగతిన మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. మోదీ చెప్పిన ప్రకారం ఇప్పుడున్న వ్యవస్థలో ప్రభుత్వ సంస్కరణలు, బ్యూరోక్రసీ పనితీరు, ప్రజల పార్టిసిపేషన్ మార్పుకు దారితీస్తుంది. సంస్కరణ, పనితీరు, మార్పు అనే విధానాన్ని అధ్యయనం చేయాలని ఆయన ఐఎస్బీ విద్యార్థులను కోరారు.
సరైన ప్రతిభను కనిపెట్టడం
"2014 తర్వాత మనం ప్రతి క్రీడలోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నామంటే దానికి మన క్రీడాకారుల విశ్వాసమే కారణమ"ని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. సరైన ప్రతిభను వెలికితీసినప్పుడు, ప్రతిభ ఉన్నప్పుడు, పారదర్శక ఎంపిక, శిక్షణతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పుడే క్రీడాకారుల్లో విశ్వాసం వస్తుందన్నారు. "ఖేలో ఇండియా, టాప్స్ స్కీమ్ వంటి సంస్కరణల వల్ల మనం క్రీడల్లో మార్పును మన కళ్ల ముందే చూడగలుగుతున్నామ"ని చెప్పుకొచ్చారు.
స్వావలంబన (self-reliant)
చిన్న వ్యాపారాలు వృద్ధి చెందడానికి మరిన్ని అవకాశాలను అందించాల్సిన అవసరాన్ని మోదీ నొక్కిచెప్పారు. కొత్త స్థానిక, ప్రపంచ మార్కెట్లతో కనెక్ట్ అవ్వడంలో వారికి సహాయపడాలన్నారు. భారతదేశాన్ని అధునాతనంగా మార్చడానికి ఇండియాని సెల్ఫ్-రిలయంట్ గా మారేలా చూడాలని ప్రధాని విద్యార్థులకు సూచించారు. ఈ విషయంలో ఐఎస్బీ వంటి సంస్థల విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. “మీ వ్యాపార నిపుణులందరికీ ఇందులో పెద్ద పాత్ర ఉంది. దేశానికి మీరు చేసే సేవకు ఇదొక గొప్ప ఉదాహరణ’’ అని మోదీ ప్రసంగాన్ని ముగించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.