NABARD Jobs 2020: నాబార్డ్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

NABARD Recruitment 2020 | నాబార్డ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీలు, అర్హతలు, ఇతర వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: August 10, 2020, 1:33 PM IST
NABARD Jobs 2020: నాబార్డ్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
NABARD Jobs 2020: నాబార్డ్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్-NABARD ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ కన్సల్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 13 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 23 వరకు అవకాశముంది. దరఖాస్తుల్లో విద్యార్హతలు, అనుభవం లాంటివి పరిగణలోకి తీసుకొని 1:10 పద్ధతిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను నాబార్డ్ అధికారిక వెబ్‌సైట్ https://www.nabard.org/ లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

Railway Jobs: మొత్తం 5285 ఉద్యోగాలతో జాబ్ నోటిఫికేషన్... క్లారిటీ ఇచ్చిన రైల్వే

Jobs: ఎయిమ్స్‌లో 3803 ఉద్యోగాలు... ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఖాళీలు

NABARD Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 13
ప్రాజెక్ట్ మేనేజర్ (అప్లికేషన్ మేనేజ్‌మెంట్)- 1
సీనియర్ అనలిస్ట్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆపరేషన్స్)- 1సీనియర్ అనలిస్ట్ (నెట్వర్క్ / SDWAN ఆపరేషన్స్ )- 1
ప్రాజెక్ట్ మేనేజర్ (ఐటీ ఆపరేషన్స్ / ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్)- 1
అనలిస్ట్ కమ్ చీఫ్ డేటా కన్సల్టెంట్- 1
సైబర్ సెక్యూరిటీ మేనేజర్- 1
అడిషనల్ సైబర్ సెక్యూరిటీ మేనేజర్- 1
అడిషనల్ చీఫ్ రిస్క్ మేనేజర్- 2
రిస్క్ మేనేజర్- 4

IBPS RRB 2020: మొత్తం 9640 బ్యాంకు ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ఐబీపీఎస్... సిలబస్ ఇదే

SBI Jobs: డిగ్రీ పాసైనవారికి ఎస్‌బీఐలో 3850 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

NABARD Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 7
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 23
విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
దరఖాస్తు ఫీజు- రూ.800. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు రూ.50.
ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ.
Published by: Santhosh Kumar S
First published: August 10, 2020, 1:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading