వివిధ కారణాలతో ఉన్నత విద్య (Higher Education)కు దూరమైన వారి కలలను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా నిజం చేసుకునే అవకాశాలు కల్పిస్తున్నాయి ప్రముఖ విద్యాసంస్థలు (Educational Institutions). రెగ్యులర్ విధానంలో కోర్సులు పూర్తి చేయలేకపోయిన వారికి ఇప్పుడు అనేక వర్సిటీలు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా ముంబై యూనివర్సిటీ (Mumbai University) కూడా మూడు స్పెషలైజేషన్స్‌లో డిస్టెన్స్ కోర్సులను అందించేందుకు సిద్ధమైంది.
* కోర్సుల వివరాలు
ముంబై యూనివర్సిటీ కొత్తగా ఎంఏ- సైకాలజీ, ఎంఏ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, ఎంఏ పబ్లిక్ రిలేషన్స్ వంటి కోర్సులను డిస్టెన్స్ మోడ్‌లో అందించనుంది. ఈ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ సెప్టెంబర్ 30లోపు ముగియనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ కోర్సులను సెషన్ మోడ్‌లో డెలివరీ చేయనున్నారు. వాటికి సంబంధించిన స్టడీ మెటీరియల్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. క్లాస్ గైడెన్స్ కోసం ఎక్స్‌ఫర్ట్ ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు.
2022-23 అకడమిక్ ఇయర్‌లో ముంబై యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ ఒపెన్ లెర్నింగ్(IDOL)కు సంబంధించిన 23 కోర్సులను యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ (UGC) ఆమోదించింది. ఎంఏ సైకాలజీ కోర్సు కోసం ఐడీఓఎల్.. కంప్యూటర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ కోర్సులో ప్రవేశం పొందాలంటే అభ్యర్థులు బీఏ సైకాలజీలో కనీసం 3 పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
* వివిధ రంగాల్లో 200పైగా కోర్సులు సైతం..
డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌తో పాటు MHT-CET, JEE మెయిన్, NATA వంటి వివిధ ప్రవేశ పరీక్షల ద్వారా UG, PG/MPhil, PhD కోర్సులకు అడ్మిషన్స్ అందిస్తోంది ముంబై వర్సిటీ. ఈ విద్యాసంస్థ వివిధ రంగాల్లో 200 యూజీ, పీజీ, డిప్లొమా, డాక్టోరల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లను సైతం ఆఫర్ చేస్తోంది.
ఇది కూడా చదవండి : బ్యాంక్ జాబ్స్‌కు ప్రిపేర్ అయ్యేవారికి గుడ్‌న్యూస్.. ఎస్‌బీఐ నుంచి భారీ నోటిఫికేషన్..!
* ఫైవ్ స్టార్ హోదా...
భారతదేశంలో అత్యంత పురాతన యూనివర్సిటీల్లో ముంబై యూనివర్సిటీ ఒకటి. దీన్ని 1857లో స్థాపించారు. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) నుంచి ఈ యూనివర్సిటీ ‘ఫైవ్ స్టార్’ హోదాను పొందింది. ఈ వర్సిటీకి ముంబైలో 230 ఎకరాలు, 13 ఎకరాల విస్తీర్ణంల్లో రెండు క్యాంపస్‌లు ఉన్నాయి.
ఇక థానే, కళ్యాణ్, రత్నగిరిలలో సబ్ సెంటర్లు కూడా ఉన్నాయి. ముంబై యూనివర్సిటీకి ఇన్‌ఛార్జ్ వీసీగా డాక్టర్ దిగంబర్ తుకారాం షిర్కే గతవారం నియమితులయ్యారు. కొత్త ఫుల్‌టైమ్ వీసీ నియామకం వరకు డాక్టర్ షిర్కే ఆ పదవిలో కొనసాగనున్నారు. గతంలో ఈ హోదాలో ఉన్న డాక్టర్ అజయ్ భామరే పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో షిర్కే నియమితులయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Distance Education, EDUCATION, JOBS, Mumbai