అన్ని సబ్జెక్టుల్లోనూ 35 మార్కులే... ఇలా పాసైన స్టూడెంట్ ఇతనొక్కడేనేమో..?

Mumbai Student : జనరల్‌గా టెన్త్ క్లాస్‌లో పాస్ మార్క్ 35 ఉంటుంది. అలాగని అన్ని సబ్జెక్టుల్లోనూ 35 మార్కులే తెచ్చుకుంటారా... ఆ స్టూడెంట్ విషయంలో అదెలా జరిగింది?

Krishna Kumar N | news18-telugu
Updated: June 11, 2019, 6:44 AM IST
అన్ని సబ్జెక్టుల్లోనూ 35 మార్కులే... ఇలా పాసైన స్టూడెంట్ ఇతనొక్కడేనేమో..?
అన్ని సబ్జెక్టులూ 35 మార్కులతో పాసైన అక్షిత్
  • Share this:
ఇది అరుదైన విషయం. ముంబై... మిరా రోడ్డులోని శాంతి నగర్ హైస్కూల్‌లో చదువుకుంటున్న అక్షిత్ జాదవ్... ఇప్పుడు టాక్ ఆఫ్ ది సిటీ అయ్యాడు. మొన్ననే టెన్త్ పాసైన ఆ పిల్లాడు... తన మార్కుల లిస్టుని చూసి షాకయ్యాడు. 55 శాతం మార్కులతో సెకండ్ క్లాస్ వస్తుందనుకుంటే... అన్ని సబ్జెక్టుల లోనూ 35 మార్కులతోనే పాస్ అవ్వడం అతనికే ఆశ్చర్యం కలిగించింది. అతని తల్లిదండ్రులు, ఆ స్కూల్ టీచర్లూ అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం లోకల్ మీడియాకు తెలియడంతో... స్థానిక ఛానెళ్లూ, రిపోర్టర్లూ... పిల్లాడితో ఇంటర్వ్యూ కోసం పోటీ పడ్డారు. సాధారణంగా పిల్లలు అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాస్తారు. తద్వారా తమకు ఎక్కువ మార్కులు వస్తాయని లెక్కలేసుకుంటారు. అక్షిత్ కూడా అదే చేశాడు. తన చదువు అంతంత మాత్రం కావడంతో... పాస్ మార్కులతో పాస్ అయ్యాడని తండ్రి తెలిపారు.

ప్రస్తుతం అందరు స్టూడెంట్ల లాగే... అక్షిత్ కూడా నెక్ట్స్ ఏం చదవాలన్నదానిపై దృష్టి సారిస్తున్నాడు. అందరూ తనను ప్రత్యేకంగా చూస్తున్నా... తక్కువ మార్కులు రావడం తనకు నచ్చట్లేదనీ, ఈసారి బాగా చదివి, మంచి మార్కులు తెచ్చుకుంటానని అంటున్నాడు.

 

ఇవి కూడా చదవండి :చందమామలో భారీ వింత లోహం... ఆశ్చర్యపోతున్న సైంటిస్టులు...

వాటే టాలెంట్ అమ్మా... మరో మైకేల్ జాక్సన్ అందామా..?
First published: June 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>