ముంబాయి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(MMRCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ ఇంజనీర్, డిప్యూటీ ఇంజనీర్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 31లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. Salary Hike: శుభవార్త.. భారత్ లో భారీగా పెరుగనున్న వేతనాలు.. ఏ రంగాల వారికంటే..
విద్యార్హతల వివరాలు: డిప్యూటీ ఇంజనీర్(PST):గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఫుల్ టైమ్ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. డిప్యూటీ ఇంజనీర్(E&M):గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్ లో ఫుల్ టైం డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఇంజనీర్(PSM): ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ లేదా డిప్లొమో చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇంజనీర్-2(E&M): గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
వేతనాల వివరాలు:
డిప్యూటీ ఇంజనీర్(PST) ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ. 50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు.
డిప్యూటీ ఇంజనీర్(E&M): ఈ ఉద్యోగాలకుఎంపికైకన వారికి నెలకు రూ. 50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు.
ఇంజనీర్-2(PST), ఇంజనీర్-2(E&M) ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 35,280 నుంచి రూ.67,920 వరకు వేతనం చెల్లించనున్నారు.
అధికారిక వెబ్ సైట్: https://www.mmrcl.com/
ఎలా అప్లై చేయాలంటే..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు సాధ్యమైనంత త్వరగా అప్లై చేసుకోవడం మంచిదని నోటిఫికేషన్లో సూచించారు. తద్వారా అప్లికేషన్లకు గడువు ముగిసే సమయంలో నెట్వర్క్ సమస్యలు ఎదురు కాకుండా చూడొచ్చని చెబుతున్నారు. అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివిన తర్వాతనే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.