హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

High Court Jobs 2022: హైకోర్టులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. మరి కొన్ని రోజులే దరఖాస్తు గడువు..

High Court Jobs 2022: హైకోర్టులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. మరి కొన్ని రోజులే దరఖాస్తు గడువు..

High Court Jobs 2022: హైకోర్టులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. మరి కొన్ని రోజులే దరఖాస్తు గడువు..

High Court Jobs 2022: హైకోర్టులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. మరి కొన్ని రోజులే దరఖాస్తు గడువు..

High Court Jobs 2022: హైకోర్టులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా.. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను నియమించనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai, India

హైకోర్టులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా.. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్(Data Entry Operator) పోస్టులను నియమించనున్నారు. దీనికి సంబంధించి

బాంబే హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసే ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు బాంబే హైకోర్టు యొక్క వెబ్‌సైట్‌ను bombayhighcourt.nic.in సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు . ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 12 అక్టోబర్ 2022. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కింద మొత్తం 76 పోస్టులను భర్తీ చేశారు.

బొంబాయి హైకోర్టులోని నాగ్‌పూర్ అండ్ ఔరంగాబాద్ బెంచ్‌లకు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ , డేటా ఎంట్రీ ఆపరేటర్‌ల నియామకం జరుగుతోంది. ఈ నియామకాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరుగుతాయి. ఇందుకోసం రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం కాల వ్యవధితో పని చేయాలి.

TSRTC Vacancies: గుడ్ న్యూస్.. TSRTCలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలిలా..

ఖాళీ వివరాలు

మొత్తం ఖాళీలు- 76

S. Noపోస్టు పేరుఖాళీల సంఖ్య
1డేటా ఎంట్రీ ఆపరేటర్50
2సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్26

విద్యార్హతలు

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్, డెవలపర్, కోడర్-కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్, కంప్యూటర్ మేనేజ్‌మెంట్ లేదా దానికి సమానమైన ఏదైనా డిగ్రీని కలిగి ఉండాలి. అంతే కాకుండా.. ఒక సంవత్సరం ప్రోగ్రామింగ్ అనుభవం కూడా కలిగి ఉండాలి.

IT Companies: ఫ్రెషర్లకు షాక్ ఇచ్చిన Wipro, Infosys, Tech Mahindra కంపెనీలు.. ఏం జరిగిందంటే..

డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ప్రభుత్వ కమర్షియల్ సర్టిఫికెట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్‌లో ఇంగ్లీష్ టైపింగ్ వేగం నిమిషానికి కనీసం 40 పదాలు ఉండాలి. కంప్యూటర్ నైపుణ్యం సర్టిఫికేట్ కూడా అవసరం. దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. అభ్యర్థులు అధికారికవ వెబ్ సైట్ ను సందదర్శించాలని.. నోటఫికేషన్ డౌన్ లోడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు చదువుకొని దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తులు సమర్పించిన తర్వాత ఎలాంటి ఎండిట్ ఆప్షన్ ఇవ్వడం కుదరదని తెలిపారు.

Expensive Schools: ఆ పాఠశాలలో వార్షిక ఫీజు రూ. కోటిన్నర.. ఒక్క విద్యార్థికి 4 గురు ఉపాధ్యాయులు.. ఖరీదైన పాఠశాలలు ఇవే..

జీతం..

సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్/డెవలపర్/కోడర్ పోస్టులకు నెలకు రూ.40894 జీతం చెల్లిస్తారు.

డేటా ఎంట్రీ ఆపరేటర్ కోసం అభ్యర్థులకు నెలకు రూ. 31, 064 జీతం చెల్లించబడుతుంది.

దరఖాస్తు  ప్రక్రియ ఇలా..

-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శిచాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

-దీనిలో వేకెన్సీస్(Recruitment) అనే ట్యాప్ కు వెళ్లాలి.

-కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో Recruitment for the post of Software Programmer  అనే అప్షన్ కు వెళ్లాలి. దీనిలో నోటిఫికేషన్, అప్లై ఆన్ లైన్ అనే రెండు కేటగిరీలు కనిపిస్తాయి.

-దరఖాస్తు ప్రక్రియలో వ్యక్తిగ వివరాలు నమోదు చేసి.. దరఖాస్తును సబ్ మిట్ చేయాలి.

-అప్లికేషన్ ఫారమ్ ను భవిష్యత్ అవసరాల కొరకు ప్రింట్ తీసుకోవాలి.

నోటిఫికేషన్ PDF కొరకు ఇక్కడ ట్యాబ్ చేయండి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, High Court, JOBS, Mumbai

ఉత్తమ కథలు