హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Mulugu: నిరుద్యోగులకు అలర్ట్.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే నెలకు 30 వేల జీతం

Mulugu: నిరుద్యోగులకు అలర్ట్.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే నెలకు 30 వేల జీతం

నిరుద్యోగులకు మంచి అవకాశం

నిరుద్యోగులకు మంచి అవకాశం

Mulugu: ఎలాంటి రాత పరీక్ష లేకుండానే నెలకు 30 వేల జీతంతో ఉద్యోగ అవకాశం పొందవచ్చు. ములుగు జిల్లాలో 20 ఉద్యోగాలు ఖాళీలున్నాయి. 05/12/2022 తేదీన జరిగే ఇంటర్వ్యూలకు హాజరైతే ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Venu Medipelly, News18, mulugu

ఎలాంటి రాత పరీక్ష లేకుండానే నెలకు 30 వేల జీతంతో ఉద్యోగ అవకాశం పొందవచ్చు. ములుగు జిల్లాలో 20 ఉద్యోగాలు ఖాళీలున్నాయి. 05/12/2022 తేదీన జరిగే ఇంటర్వ్యూలకు హాజరైతే ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది. ములుగు జిల్లాలో ప్రస్తుతం నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతుంది. ఏకకాలంలోనే అభ్యర్థులకు రెండు నోటిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి.

ములుగు జిల్లా కోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. నిరుద్యోగ అభ్యర్థులకు మరో సువర్ణ అవకాశం అధికారులు కల్పిస్తున్నారు. ములుగు జిల్లాలో మరొక నోటిఫికేషన్ జారీ చేసిన అధికారులు రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధిత జిల్లా వైద్య అధికారులు నోటిఫికేషన్లను జారీ చేస్తున్నారు. ములుగు జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయము, ములుగు జిల్లాలో వివిధ ప్రాధమిక,ఆరోగ్య కేంద్రాలలో, కంటివెలుగు(ఫేజ్-2)కార్యక్రమము నందు పనిచేయుటకు పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్స్పోస్టులను పొరుగు సేవల పద్దతిలో నియమిత కాలవ్యవధి నిమిత్తము తీసుకొనుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఏ ఉద్యోగం...?

ఎన్ని ఖాళీలు...?

ఎవరు అర్హులు...?

జీతం ఎంత...?

పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్స్-20

అర్హత : రెండు సంవత్సరాల డిప్లమా పూర్తి చేసి ఉండాలి... పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి...

జీతం : నెలకు 30 వేల జీతం

అర్హులైన అభ్యర్థులు పూర్తి చేసిన ధరఖాస్తు ఫారాలు, స్వీయ దృవీకరించబడిన సర్టిఫికెట్ కాపీలు, జతపరచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం ములుగు నందు 01.12.2022 నుండి 04.12.2022 వరకు సమర్పించవలెను,దరఖాస్తు ఫారంలు అన్ని పనిదినములలో ఉ.10.30నుండి సా. 5.00 వరకు కార్యాలయము నందు లభించును. లేదా www.mulugu.telangana.gov.in నందు లభించును.

పూర్తిచేసిన దరఖాస్తులను తేదీ 04.12.2022సా 5.00 గం.ల లోపు DM&HO కార్యాలయమునందు సమర్పించవలెను.పూర్తి వివరాలకు ఆఫిసు నోటీసు బోర్డుపై చూడగలరు.

గమనిక: దరఖాస్తు చేసిన అభ్యర్థులందరూ తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో 05.12.2022 నాడు ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు.

ఇట్టి అవకాశాన్ని ములుగు జిల్లా నిరుద్యోగ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు.

First published:

Tags: Job, Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు