మినిస్ట్రీ ఆఫ్ మైక్రో(Micro), స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME) ఆధ్వర్యంలోని డెవలప్‌మెంట్ కమీషనర్ కార్యాలయం యంగ్ ప్రొఫెషనల్(Young Professional), సీనియర్ కన్సల్టెంట్(Senior Consultant) తో సహా పలు పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను కోరింది. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు MSME అధికారిక వెబ్‌సైట్ msme.gov.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. అంతే కాకుండా.. అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు దరఖాస్తు(Appliation) చేసుకోవడానికి ఈ https://msme.gov.in/ లింక్ పై క్లిక్ చేసి పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్(Notification) ప్రకారం మొత్తం 07 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 31, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఖాళీ వివరాలు ఇలా..
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
యంగ్ ప్రొఫెషనల్ | 02 |
కన్సల్టెంట్ గ్రేడ్ 1 | 02 |
కన్సల్టెంట్ గ్రేడ్ 2 | 01 |
సీనియర్ కన్సల్టెంట్ | 02 |
అర్హత ప్రమాణాలు..
యంగ్ ప్రొఫెషనల్ .. సంబంధిత సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా ప్రీమియర్ విద్యా సంస్థల నుండి BE/B.Tech లేదా CS లేదా IT లేదా MCA డిగ్రీ పూర్తి చేయాలి. అలాగే సంబంధిత రంగంలో కనీసం 1 సంవత్సరం పని అనుభవం ఉండాలి.
కన్సల్టెంట్ గ్రేడ్ 1- BE / B-Tech / ME / M-Tech / MBA (ఫైనాన్స్) / MA (ఎకనామిక్స్) / LLB/LLMతో పాటు సంబంధిత రంగంలో 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
కన్సల్టెంట్ గ్రేడ్ 2- సంబంధిత రంగంలో కనీసం 8 సంవత్సరాల పని అనుభవంతో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుండి LLB.
సీనియర్ కన్సల్టెంట్ - ప్రభుత్వంలో కనీసం 15 సంవత్సరాల పని అనుభవం లేదా క్యాడర్‌లో కనీసం 6 సంవత్సరాల అనుభవంతో అండర్ సెక్రటరీ కార్యాలయంలో పనిచేసిన అనుభవం ఉన్న ఏదైనా రంగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తులను వివిధ అర్హత సర్టిఫికేట్ల జిరాక్స్ లను స్కానింగ్ తీసి.. Estt-hqrs@dcmsme.gov.in మెయిల్ కు పంపించాలి.
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.80,000ల నుంచి రూ.2,65,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Central Government Jobs, Central jobs, JOBS, Msme jobs