MRPL RECRUITMENT 2019 MANGALORE REFINERY AND PETROCHEMICALS LIMITED INVITES APPLICATIONS FOR 223 POSTS APPLY BEFORE NOVEMBER 9 SS
Jobs: మొత్తం 223 జాబ్స్‌కు మంగళూరు రిఫైనరీ నోటిఫికేషన్
Jobs: మొత్తం 223 జాబ్స్‌కు మంగళూరు రిఫైనరీ నోటిఫికేషన్
(ప్రతీకాత్మక చిత్రం)
MRPL Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ mrpl.co.in ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్లో నోటిఫికేషన్ చూడొచ్చు.
మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్-MRPL పలు పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్-ONGC అనుబంధ సంస్థ ఇది. ట్రైనీ అసిస్టెంట్, జూనియర్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 223 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తుకు నవంబర్ 9 చివరి తేదీ. స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఆసక్తిగల అభ్యర్థులు మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ mrpl.co.in ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్లో నోటిఫికేషన్ చూడొచ్చు. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 11
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 9 సాయంత్రం 6 గంటలు
విద్యార్హత- గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- 45 ఏళ్ల లోపు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.