Home /News /jobs /

MOST OF THE INDIANS WHO ARE DOING WORK FROM HOME ARE READY TO GET BACK TO OFFICES REVEALS NEWS18 SURVEY NS GH

Work From Home వద్దు.. ఆఫీసులకే వెళ్తామంటున్న ఐటీ ఉద్యోగులు.. న్యూస్ 18 తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Back to Office: ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడం మానేసి దాదాపు 9 నెలలు కావొస్తోంది. కోవిడ్–19 కారణంగా అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే, మొదట్లో వర్క్ ఫ్రమ్ హోం అనగానే ఎగిరి గంతేసిన ఉద్యోగులు.. ఇప్పుడు ఈ విధానాన్ని వద్దంటున్నారట! న్యూస్18 సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలివే..

ఇంకా చదవండి ...
ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడం మానేసి దాదాపు 9 నెలలు కావొస్తోంది. కోవిడ్–19 కారణంగా అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే, మొదట్లో వర్క్ ఫ్రమ్ హోం అనగానే ఎగిరి గంతేసిన ఉద్యోగులు.. ఇప్పుడు ఈ విధానాన్ని వద్దంటున్నారట! వైరస్ వ్యాప్తి భయాలు లేకుండా, ప్రయాణాలు చేయాల్సిన అవసరం రాకుండా, కుటుంబానికి దగ్గరగా ఉంటూ పనిచేయడం మొదట్లో అందరికీ సౌకర్యవంతంగా అనిపించింది. అయితే, క్రమంగా ఉద్యోగుల(Employees) ఆలోచనల్లో మార్పు వస్తుందని, ఈ విధానంతో ఒత్తిడి పెరగడమే కాక, నాలుగు గోడల మధ్య పనిచేయలేక పోతున్నామని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఆఫీసులో సహోద్యోగులను(Colleagues), వర్క్ కల్చర్ను ఎంతగానో మిస్సవుతున్నామని చెబుతున్నారు. తాజాగా, వర్క్ ఫ్రం హోమ్(Work From Home) విధానంపై ప్రముఖ మార్కెట్ పరిశోధనా సంస్థ యుగోవ్(YouGov) భాగస్వామ్యంతో న్యూస్ 18 సర్వే(News18 Survey) నిర్వహించింది.

ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది కరోనాకు ముందు లాగే కార్యాలయాల నుంచి పని చేయడమే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సర్వేలో పాల్గొన్న ప్రతి 10 మంది ఉద్యోగుల్లో 7 మంది కరోనాకు ముందు ఉన్న వర్క్ ఫ్రం ఆఫీస్(Work From Office) విధానమే బాగుందని తెలిపారు. అయితే, ప్రస్తుతం కరోనా(Corona) ఉదృతిని దృష్టిలో పెట్టుకొని ఆయా సంస్థలు తగిన భద్రతా చర్యలు తీసుకుంటే తాము కార్యాలయాల నుంచి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. మరి కొంత మంది మాత్రం కరోనా టీకా(Vaccine) అందరికీ వేసే అందుబాటులోకి వచ్చే వరకు వేచి చూడడాలని భావిస్తున్నారు.

1015 పట్టణాల్లోని ఐటీ నిపుణులపై జరిగిన సర్వే..
2020 డిసెంబర్ 29 నుంచి 2021 జనవరి 3 మధ్య ఆరు రోజుల పాటు ఈ సర్వే జరిగింది. దీనిలో 1015 పట్టణాలకు చెందిన భారతీయ ఐటీ నిపుణుల నుంచి డేటా సేకరించారు. ఈ సర్వే ద్వారా ఐటీ నిపుణుల నుంచి ఆసక్తికర విషయాలు రాబట్టింది. సర్వేలో పాల్గొన్న వారిలో సుమారు 67% మంది వర్క్ ఫ్రం ఆఫీసు విధానమే బాగుండేదని పేర్కొన్నారు. కాగా సర్వేలో పాల్గొన్న వారిలో, కనీసం మూడింట ఒక వంతు మంది దేశంలోని ప్రతి ఒక్కరికి టీకాలు(Vaccine) వేసిన తర్వాత మాత్రమే తమ కార్యాలయాలకు తిరిగి వెళ్లాలని భావిస్తున్నారు. అయితే, సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది కరోనా వ్యాప్తి పట్ల మాత్రమే ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే, ఆఫీసు(Office)లకు వెళ్లడానికి చేసే ప్రయాణాలపై ఎటువంటి విముఖత వ్యక్తం చేయకపోడం ఆశ్యర్యకర పరిణామని చెప్పవచ్చు. ఇక, 2021లో కొత్త ఉద్యోగ అవకాశాలు(Job Market), ఉద్యోగ భద్రతపై వారిని ప్రశ్నించగా.. ఎక్కువమంది కొత్త ఏడాది ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 32 శాతం మంది మాత్రం ఉద్యోగ అవకాశాలపై ఎటువంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదు. ఏదేమైనా, ఎక్కువ మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్(Work From Home ) కంటే ఆఫీసు నుంచి పని చేయడానికే మొగ్గు చూసినట్లు సర్వే స్పష్టం చేసింది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Network18, Work From Home

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు